6, సెప్టెంబర్ 2018, గురువారం

శాల్తీ వేతనాలు (piece wages)


అధ్యాయం 21
శాల్తీ వేతనాలు
వేతనం అనేది శ్రమశక్తి విలువకి మారిన రూపం. అలాగే మారిన కాలం వేతనం రూపమే శాల్తీ వేతనం.
ఈవిధానంలో శ్రామికుని నుంచి పెట్టుబడిదారుడు కొన్నది సజీవ శ్రమని కాదనీ, ఉత్పాదితంలో అప్పటికే రూపొందిన శ్రమ అనీ అనిపిస్తుంది. శ్రమ ధర కాలం వేతనాలకు భిన్నంగా నిర్ణయమయ్యేట్లు కనిపిస్తుందికాలం వేతనాలు రోజు శ్రమశక్తి విలువ/పనిదినంలో గంటల సంఖ్య అనే భిన్నాన్ని బట్టి నిర్ణయమవుతుందిశాల్తీ వేతనం నిర్ణయమయ్యేది దీన్ని బట్టికాదు,శ్రామికుని శ్రమ చేసే శక్తిని బట్టి అనిపిస్తుంది. 
అదే శ్రమ కొన్నిపరిస్థితుల్లో శాల్తీ వేతనం గానూమరికొన్ని పరిస్థితుల్లో కాలం వేతనంగానూ చెల్లించబడుతుంది.  ఒకే పరిశ్రమ శాఖల్లో పక్కపక్కనే రెండు రూపాలూ ఏక కాలంలో ఉండడం చూసి పై రూపం మీద నమ్మకం దెబ్బ తింటుంది .ఉదాహరణకి
1.లండన్ కంపోజిటర్లు శాల్తీల ప్రకారం పనిచేస్తారుకాలం పని మినహాయింపుగా ఉంటుందిఅదేపని గ్రామాల్లో రోజుని బట్టి పనిచేస్తారు.  ఓడలు నిర్మించే కార్మికులు లండన్లో పనినిబట్టీ చేస్తారుశాల్తీని బట్టీ చేస్తారు.ఇతర ప్రాంతల్లో రోజుని బట్టి చేస్తారు.
2. ఒకే  జీనుల షాపులోఫ్రెంచ్ వాళ్ళకి శాల్తీ వేతనాలూఇంగ్లిష్ వాళ్ళకి కాలం వేతనాలు చెల్లిస్తారు.
3. శాల్తీ వేతనాలు ప్రబలంగా ఉన్న ఫాక్టరీల్లోకొన్ని రకాల పనులకి శాల్తీ వేతన రూపం కుదరదుఅలాంటి పనులకి కాలం వేతనం ఇస్తారు.
అదే శ్రమ కొన్నిపరిస్థితుల్లో శాల్తీ వేతనం గానూమరికొన్ని పరిస్థితుల్లో కాలం వేతనంగానూ చెల్లించబడుతుంది.  ఒకే పరిశ్రమ శాఖల్లో పక్కపక్కనే రెండు రూపాలూ ఏక కాలంలో ఉండడమూ కద్దు..
ఉదాహరణలు,
1.లండన్ కొంపోజిటర్లు శాల్తీల ప్రకారం పనిచేస్తారుకాలం పని మినహాయింపుగా ఉంటుందిఅదేపని గ్రామాల్లో రోజుని బట్టి పనిచేస్తారు.  ఓడలు నిర్మించే కార్మికులు లండన్లో పనినిబట్టీ చేస్తారుశాల్తీని బట్టీ చేస్తారు.ఇతర ప్రాంతల్లో రోజుని బట్టి చేస్తారు.
2. ఒకే  జీనుల షాపులోఫ్రెంచ్ వాళ్ళకి శాల్తీ వేతనాలూఇంగ్లిష్ వాళ్ళకి కాలం వేతనాలు చెల్లిస్తారు.
3. శాల్తీ వేతనాలు ప్రబలంగా ఉన్న ఫాక్టరీల్లోకొన్ని రకాల పనులకి శాల్తీ వేతన రూపం కుదరదుఅలాంటి పనులకి కాలం వేతనం ఇస్తారు.
 రెండురకాల వేతనాలూ శ్రమ శక్తి ధర చెల్లించే రెండు భిన్న రూపాలు మాత్రమేవేతన రూపాల్లో మార్పు వాటి సారభూత స్వభావాన్ని మార్చదువాటిలో ఒకటి రెండోదానికంటే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికి అనుకూలంగా ఉండవచ్చు.ఉన్నాసారాన్ని మార్చజాలదు.
శాల్తీ వేతనాల పరిమాణాన్ని తేల్చే విధానం:   
పనిదినం 12 గంటలుఅందులో 6 గంటలు చెల్లించబడిన శ్రమ , 6 గంటలు చెల్లించబడని శ్రమఅనుకుందాంఉత్పాదితం విలువ 6 షిల్లింగులు అయిటేగంట శ్రమ విలువ 6 పెన్నీలు అవుతుంది.ఒక కార్మికుడు 12 గంటల్లో 24 శాల్తీలు చేస్తేవాటిలో ఉన్న స్థిర పెట్టుబడిని తీసేశాకవాటి విలువ 6 షిల్లింగులుఒక్కొక్క దాని విలువ 3 పెన్నీలు.అందులో శ్రామికుడికి శాల్తీకి        1 ½  పెన్నీలుఆవిధంగా అతను 12 గంటల్లో 3 షిల్లింగులు పొందుతాడు.
ప్రతిగంట పనిలోనూ కొంత యజమానికి
కాలం వేతనాలలో మాదిరిగానే,ఇక్కడ కూడా  శ్రామికుడు 6 గంటలు తనకోసంపెట్టుబడిదారుడికోసం 6 గంటలు పనిచేస్తాడు అనుకున్నాప్రతి గంటలోనూ అరగంట తనకోసంఅరగంట పెట్టుబడిదారుడికోసం 6 గంటలు పనిచేస్తాడు అనుకున్నా ఎమీ ఫర్వాలేదు.ప్రతి శాల్తీలో చెల్లించ బడిన శ్రమ సగమూచెల్లించ బడని శ్రమ సగమూ ఉంటుంది. 12 శాల్తీల ధర శ్రమ శక్తి విలువకి సమానకంఅదనపు విలువ ఇమిడి ఉంటుంది.
శాల్తీ వేతన రూపం హేతువిరుద్ధమైనట్లేకాలం వేతనా రూపం ఎంత కూడా అహేతుకమైనదేమన ఉదాహరణలొ 2 శాల్తీల విలువ 6 పెన్నీలుఅందులో శ్రామికుడు పొందేది 3 పెన్నీలు.శాల్తీ వేతనాలు వాస్తవానికి  ఇతర విలువ సంబంధాన్నీ వ్యక్తం చెయ్యవు.కాబట్టి ప్రశ్న ఒక శాల్తీ విలువని దానిలో ఉన్న శ్రమ కాలంతో కొలవడం అన్నది కాదుఅందుకు భిన్నంగా శ్రామికుడు ఉత్పత్తిచేసిన శాల్తీల సంఖ్యని బట్టి అతని వెచ్చించిన శ్రమ కాలాన్ని కొలవడం అన్నది ప్రశ్న.కాలం వేతనాల్లో కాలవ్యవధిని బట్టి శ్రమని వెంటనే కొలవచ్చుశాల్తీ వేతనాల విషయం అలాకాదు.ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఎంత పరిమాణం ఉన్న ఉత్పాదితాల శ్రమ చేరింది - అనే దాన్ని బట్టి  కొలవబడుతుంది.  శ్రమ కాలం ధర అంతిమంగా  సమీకరణ ద్వారా నిర్నయమవుతుంది:
ఒకరోజు శ్రమ విలువ = ఒక రోజు శ్రమ శక్తి విలువ
కాబట్టి శాల్తీ వేతనం అనేది కాలం వేతనం యొక్క మారిన రూపమే.
శాల్తీ వేతనాల ప్రత్యేక లక్షణాలు:
1.ఇక్కడ శ్రమ నాణ్యతని పనే అదుపుచేస్తుంది.శాల్తీ ధర సరిగ్గా రావాలంటే పని సగటు పరిపూర్ణత కలదై ఉండాలిఈదృష్టితో చూస్తేశాల్తీ వేతనాలు  వేతనాల తగ్గింపుకీపెట్టుబడిదారీ మోసానికీ వనరులుగా ఉంటాయి.
శాల్తీ వేతనాలు  శ్రమ తీవ్రతకి కచ్చితమైన కొలమానాన్ని సమకూరుస్తాయిఒక సరుకుల మొత్తంలో ఉన్న శ్రమ కాలం ఫలానింత అని అనుభవపూర్వకంగా ముందుగానే నిర్ణయమై ఉంటుంది.అదే సామాజికంగా అవసరమైన శ్రమకాలంగా లెక్కకొస్తుందిదాని ప్రకారమే చెల్లింపు ఉంటుంది.
అందువల్లలండన్ లో పెద్ద దర్జ్జీ షాపుల్లో వైస్ట్ కోటుని గంట అనీఅరగంట అనీ అనేవాళ్ళు.గంట అంటే 6 పెన్నీలు.అనుభవరీత్యాఒక గంట సగటు ఉత్పాదితం ఎంతో తెలుసు.
కొత్త ఫాషన్లూరిపేర్లూ వచ్చినప్పుడు దనికెంత టైం పట్టేదీ అనుభవం ఉండదు.కాబట్టి  కొత్తపనికి గంటా అరగంట  కాక మరొకటా అనే దగ్గర వాదం ఏర్పడుతుందిఆకొత్తపనికి కూడా కాలక్రమంలో అలవాటయి ఫలానింత అని స్థిరపడుతుందిఅప్పటిదాకా వాదం కొనసాగుతూనే ఉంటుంది.
స్లో గా పనిచేసేవాళ్ళు డిస్మిస్ అవుతారు
లండన్ ఫర్నిచర్ మొదలైన వర్క్ షాపులుల్లోపనివాడికి సగటు శక్తి లేకపోతేఆకారణంగా అతను కనీసపని చెయ్యలేకపోతే అతను డిస్మిస్ అవుతాడుఉదాహరణకినూలు వడికే వాడికి కొంత దూది ఇస్తారు దూదికి బదులు దాన్ని నిర్ణీత కాలంలో వడికి నూలు ఇవ్వాలి.ఆనూలుకి నిర్ణీత నాణ్యత ఉండాలిఅప్పుడు అతనికి పౌనుకి ఇంతని చెల్లిస్తారుఅతని పనిలో  అనుకున్న నాణ్యత లోపిస్తే జుల్మానా వేస్తారు. నూలు కనీస పరిమాణానికంటే తగ్గితే  పనివాణ్ణి డిస్మిస్ చేస్తారు.అతని స్థానంలో సామర్ధ్యం ఉన్న వాణ్ణి పెట్టుకుంటారు. (Ure, l.c., p. 317 )
పర్యవేక్షణ అవసరం తగ్గుతుంది. 
పని నాణ్యతనీతీవ్రతనీ వేతన రూపం అదుపుచేస్తుందికాబట్టి పర్యవేక్షించే పని చాలాభాగం అవసరం ఉండదు.
పని నాణ్యతనీతీవ్రతనీ వేతన రూపం అదుపుచేస్తుందికాబట్టి పర్యవేక్షించే పని చాలాభాగం అవసరం ఉండదుశాల్తీ వేతనంఅందువల్లఆధునికి గృహ శ్రమకి ప్రాతిపదిక అవుతుందిదాంతోపాటేదొంతర్ల వారీగా నిర్వహించబడే దోపిడీకిఅణచివేతకీ పునాది అవుతుందిఈరెండోదానికి రెండు మౌలికరూపాలుంటాయి:
పరాన్నభుక్కులకి అవకాశం
ఒకపక్కశ్రామికుడికీపెట్టుబడిదారుడికీ మధ్య పరాన్నభుక్కులు - కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకు బాడుగకిచ్చే వాళ్ళకి -అవకాశం లభిస్తుంది మధ్య మనుషులకి (middlemen) పెట్టుబడిదారుడు వాళ్ళకిచ్చే శ్రమధరకీవాళ్ళు శ్రామికులకి చేర్చే ధరకీ మధ్య ఉండే తేడాయే వాళ్ళ లాభంఇంగ్లండ్ లో  వ్యవస్థని చెమట పట్టించే విధానం (sweating system)అంటారు.వేతనం ఎక్కువమంది చేతుల గుండా వస్తేలాభంలో వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకుంటారు.అసలు పనిచేసే చివరివాడు తక్కువ పొందుతాడు.
శ్రామికుడిచేత శ్రామికుడు దోపిడీ చెయ్యబడడం
మరొకపక్కఒక శాల్తీకి ఇంత చొప్పున ఇస్తానని పెట్టుబడిదారుడు పనిపెద్ద (head labourer)తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం శాల్తీ వేతనం వల్ల కలుగుతుంది పనిపెద్ద పనివాళ్ళని పెట్టుకొని పనిచేయించి డబ్బిచ్చే బాధ్యత తీసుకుంటాడుఇక్కడ   శ్రామికుడిచేత శ్రామికుడు దోపిడీ చెయ్యబడడం ద్వారా పెట్టుబడి దారుడు శ్రామికుణ్ణి దోపిడీ చెయ్యడం అమలుజరుగుతుంది.
శ్రమ తీవ్రత పెంచే పోకడా - పనిగంటలు పెంచే పోకడా
శాల్తీ వేతనంలో శ్రామికుడి సొంత ప్రయోజనం తన శ్రమశక్తిని ఎంత వీలయితే అంత తీవ్రతతో వ్యయించేట్లు చేస్తుంది.ఇది పెట్టుబడి దారుడు మామూలు శ్రమ తీవ్రత స్థాయిని సులువుగా పెంచే వీలు కలిగిస్తుందిశాల్తీ పనివాళ్ళు చట్టబద్ధ పనిదినాన్ని  వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళే పొడిగిస్తారుఎందుకంటేఅలా పొడిగిస్తే వాళ్ళకి రోజుకి లేక వారానికి ఎక్కువ వేతనం ముడుతుంది
ఇది క్రమంగా శాల్తీ వేతనం స్థిరంగా ఉన్నా,కాలం వేతనంలో వివరించిన ప్రతిచర్య వంటిదానినే తెచ్చిపెడుతుంది.
ఎక్కువ గంటలు పనిచేసినందువల్లరోజు వేతనం పెరుగుతుందిఅదే సమయంలో ఉరువుకి వేతనం తగ్గే ప్రభావం ఉంటుంది.అసలు రోజు వేతనమే తగ్గ వచ్చు
కాలం వేతనాల్లో ఒకే రకం పనికి ఒకే వేతనం ఉంటుందిశాల్తీ వేతనాల్లో తేడాలుంటాయి.ఎందుకంటేఅందరూ ఒకే పరిమాణంలో సరుకులు తయారు  చెయ్యలేరుఒకరు కనీస పరిమాణంలోమరొకరు సగటు పరిమాణంలోఇంకొకరు సగటును మించి సరఫరా చేయ్యవచ్చుఒక్కొక్కరి శక్తిని బట్టీనైపుణ్యాన్ని బట్టీ ఉత్పాదితాల పరిమాణంలో తేడాలుంటాయివాటికి తగినట్లు రోజు వేతనంలో తేడాలుంటాయి.
అయితే  పరిస్థితి పెట్టుబడికీ వేతనశ్రమకీ ఉండే సాధారణ సంబంధాల్ని మార్చదు వ్యక్తుల మధ్య ఉండే  తేడాలు  వర్క్ షాప్ ని ఏక మొత్తంగా చూసినప్పుడు సమతూకం ఏర్పడుతుందినిర్దిష్ట కాలంలో సగటు ఉత్పాదితం సరఫరా అవుతుంది.ఒక పరిశ్రమలో చెల్లించే వేతనాలు సగటు వేతనాలు అవుతాయి.
రెండో విషయంవేతనాలకీ అదనపు విలువకీ ఉండే నిష్పత్తి మారదు.అలాగే ఉంటుందికారణంఒక విడి కార్మికుడూ ఇచ్చే అదనపుశ్రమ మొత్తం అతను పొందే వేతనానికి అనుగుణంగా ఉండడమే.
శాల్తీ వేతనాలు వ్యక్తి ప్రత్యేకతకి అవకాశం ఇస్తాయిదాంతో ఒకపక్క శ్రామికుల్లో స్వేచ్చస్వాతంత్ర్యం,సొంత అదుపు అనే భావన అభివృద్ధిచెందుతుందిమరొకపక్కఅదే కార్మికుల్లో ఒకరితో ఒకరికి పోటీ పెరుగుతుందిఅందువల్లశాల్తీ వేతనాలకు విడికార్మికుల వేతానాల్ని సగటుని మించి  పెంచుతూనేఅసలు  సగటునే తగ్గించే పోకడ/ధోరణి ఉంటుంది
అయితేశాల్తీధర రేటు దీర్ఘకాలం స్థిరంగా ఉండిదాన్ని తగ్గించడం ఇబ్బందికరమైనదయితేయజమానులు అలాంటి అసాధారణ పరిస్థితుల్లో కొన్నిసార్లు తప్పనిసరిగా కాలం వేతనాల్లోకి తిరిగి మారుస్తారు.కొవెంటరీలో రిబ్బన్ నేతగాళ్ళు 1860 లో చేసిన పెద్ద సమ్మె ఇందుకు ఉదాహరణ.
అసలు వేతన పద్ధతిలోనే వేతనాన్ని తగ్గిస్తూగూడాపనిదినాన్ని పొడిగించడంశ్రమ తీవ్రతని పెంచడం అనే ధోరణి ఉంటుంది.
గంటవారీ  పద్ధతికి ఒక ప్రధాన సపోర్ట్
శాల్తీ పద్ధతి అనేది అంతిమంగా ఇంతకు ముందు అధ్యాయంలో వివరించిన గంటవారీ  పద్ధతికి ఒక ప్రధాన సపోర్ట్ఫుట్ నోట్కొన్ని వర్క్ షాపుల్లో అవసరమైన వాళ్ళకంటే ఎక్కువమందిని పెట్టుకోవడం తెలిసిందేఅనేక సందర్భాల్లో భవిష్యత్తులో పని వస్తుందని ఆశించి పనివాళ్ళని నియమిస్తారుఆపని ఎప్పటికీ రాకపొవచ్చుఇచ్చేది శాల్తీ వేతనం గనక యజమానులకి పొయేదేమీ లేదుపనికాలం నష్టమైతేఅది పని  దొరకని నిరుద్యోగులమీద పడుతుంది - H. Gregoir (1865)
ఇంతదాకా పరిశీలించిన దాన్ని బట్టిశాల్తీ వేతనం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి అతికినట్లు సరిపొతుంది.
చారిత్రిక రుజువులు
14  శతాబ్దపు ఫ్రెంచ్ఇంగ్లిష్ కార్మిక చట్టాల్లో కాలం వేతనం తో పాటే శాల్తీ వేతనం పక్కనే అధికారికంగా ఉందికాబట్టి శాల్తీ వేతన పద్ధతి కొత్తదేమీ కాదుఅయినప్పటికీఅది గొప్ప గెలుపు సాధించింది మాత్రం కార్ఖానా కాలంలోనేఆధునిక పరిశ్రమ కాలంలోమరీ ముఖ్యంగా 1797 నుంచీ 1815 వరకూ అది పనిదినం పొడిగింపుకీవేతన తగ్గింపుకీ మీట (lever) గా ఉపకరించింది. ఆకాలంలో వేతనాల ఎగుడుదిగుడుల గురించిన సమాచారం బ్లూ బుక్స్ లో లభిస్తుంది:
జకోబిన్ వ్యతిరేక యుద్ధం ప్రారంభమైనప్పటి నుండీ శ్రమ ధర నిరంతరాయంగా ఎలా తగ్గించబడిదో వీటిలో సాక్ష్యాధారాలు ఉన్నాయిఉదాహరణకినేత పరిశ్రమలో శాల్తీ వేతనాలు ఎంతో పడ్డాయిఎంతగానంటేపనిదినాన్ని బాగా పెంచినా గూడారోజుకి వచ్చే వేతనం అంతకుముందుకన్నా తక్కువగానే ఉంది.
నేతగాని సంపాదన మునుపటి కంటే ఇప్పుడు చాలా తక్కువఒకప్పుడు మామ్మూలు కార్ముక్ని మీద అతనికున్న గొప్ప ఆధిక్యత ఇప్పుడు దాదాపు అంతరించిందినిజానికి మామ్మూలు శ్రామికునికీనిపుణ శ్రామికునికీ వేతనంలో ఏకాలంలోనైన ఉన్న తేడా కంటే ఇప్పుడు ఎంతో తక్కువ వుంది - Remarks on the Commercial Policy of Great Britain, London, 1815, p. 48.
వ్యవసాయంలో శాల్తీవేతనాల ప్రభావాలు
వ్యవసాయ కార్మికులకి శాల్తీవేతనాల ద్వారా పెరిగిన శ్రమ తీవ్రతవల్లా,,విస్తృతి వల్లా చాలా తక్కువ ప్రయోజనం కలిగిందిఅని భూస్వాముల పక్షానరైతుల పక్షాన రాసిన పుస్తకంలో ఉన్న  భాగం తెలుపుతుందివ్యవసాయంలో చాలా ఎక్కువ భాగం రోజుకూలికి,లేక శాల్తీ పనికీ పెట్టుకున్న పనివాళ్ళతోనే జరుగుతుంది.వాళ్ళ వారంవేతనం ఇంచుమించు 12 షిల్లింగులు.ఒకవేళ శాల్తీ శ్రామికుదు ఎక్కువ ప్రేరణ వల్ల వారానికి ఒకటి రెండు షిల్లింగులు ఎక్కువ సంపాదిస్తాడు అనుకుందాం.అయినప్పటికీమొత్తం ఆదాయాన్ని లెక్కగడితే సంవత్సరంలో అతను అదనంగా పొందేదానికంటే,  పని లెని కాలం కొంత ఉంటుంది కనక దాని మూలంగా పోగొట్టుకునేదే ఎక్కువ.  సాధారణంగా  శ్రామికుల వేతనాలు జీవితవసార వస్తువుల ధరకు తగిన నిష్పత్తిలో ఉంటాయి;ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని చర్చి సహాయం లేకుండానే పొషించగల నిష్పత్తిలో ఉంటాయి.
అప్పట్లో మాల్థూస్ ఇలా అన్నాడు:శాల్తీ వేతనం అలవాటుని అధికంగా విస్తరింపజెయ్యడాన్ని అపనమ్మకంతో గమనిస్తున్నట్లు ఒప్పుకుంటున్నాను.12,14 ఇంకా ఎక్కువ గంటల కఠిన శ్రమ ఏమనిషికైనా ఎంతో అధికమైనదే.
ఫాక్టరీ చట్టాల ప్రభావాలు
ఫాక్టరీ చట్టాల కింద ఉన్న వర్క్ షాపుల్లోశాల్తీ వేతనాలు సాధారణ నియమంగా  ఉంటాయిఎందుకంటేఅక్కడ మాత్రమే పెట్టుబడి శ్రమని తీవపరచడం ద్వారా పనిదినపు సామర్ధ్యాన్ని పెంచగలుగుతుంది.ఫాక్టరీల్లో అయిదింట నాలుగొంతుల (4/5) మంది పనివాళ్ళు శాల్తీ వేతనాలవాళ్ళే-Reports of the Inspectors of Factories..30 April 1858, p. 9)
శాల్తీ వేతనాలూ - ఉత్పాదకతలో మార్పులూ
ఇక్కడ లెక్క స్పష్టమేశ్రమ ఉత్పాదకత మారితేఅదే ఉత్పాదితం భిన్నమైన శ్రమకాలానికి ప్రాతినిధ్యం వహిస్తుందిఅంటే మునుపు పట్టిని శ్రమ కంటే ఇప్పుడు పట్టే శ్రమలో తేడా ఉంటుంది.కనుక శాల్తీ ధరకూడా మారుతుందిఒక నిర్ణీత పనికాలానికి శాల్తీ వేతనం అనేది డబ్బు వ్యక్తీకరణ కావడమే కారణం.
మనపై ఉదాహరణలో 12 గంటల్లో 24 శాల్తీలు ఉత్పత్తయ్యాయివాటి విలువ 6 షిల్లింగులురోజు శ్రమశక్తి విలువ 3 షిల్లింగులు.దీన్ని బట్టిగంట శ్రమ ధర 3 పెన్నీలు.ఒక శాల్తీకి వేతనం అరపెన్నీ.ఒక శాల్తీ అరగంట శ్రమని పీల్చుకుంటుందిఅదే శ్రమ దినం ఇప్పుడు ఉత్పాదకత రెట్టింపయినందువల్ల 24 కాకుండా 48 శాల్తీలు చేస్తేఒక శాల్తీకి వేతనం 1 ½ పెన్నీనుండి 3/4 పెన్నీకి పడిపోతుంది.కరణం అరగంట శ్రమకి బదులు ఇప్పుడు పావుగంట శ్రమకే ప్రాతినిధ్యం వహిస్తుంది. 24*1 ½ పెన్నీలు = 3 షిల్లింగులు.అదేవిధంగా 48*3/4 పెన్నీలు = 3 షిల్లింగులుశాల్తీ 1 ½  పెన్నీచొప్పున 24 శాల్తీలు 3 షిల్లింగులుఒక్కొక్కటి ముప్పాతిక పెన్నీ అయితే 48 శాల్తీలు 3 షిల్లింగులుదీన్నే ఇంకోవిధంగా చెబితే,ఒకేకాలంలో ఉత్పత్తయిన శాల్తీల సంఖ్య పెరిగే నిష్పత్తిలోనే శాల్తీ వేతనం తగ్గుతుంది.అంటే ఆశాల్తీమీద ఖర్చయ్యే శ్రమకాలం తగ్గే నిష్పత్తిలోనే. 
శాల్తీ వేతనంలో  మార్పు పెట్టుబడి దారుడికీశ్రామికులకీ మధ్య ఎడతెగని పోరాటాలకు దారితీస్తాయి.పెట్టుబడిదారుడు శ్రమధరని  వాస్తవంగా తగ్గించడానికి వంకగా ఉపయోగించుకోవడం వల్ల కావచ్చులేదా శ్రమ ఉత్పాదకత పెరుగుదల శ్రమ తీవ్రతని పెంచినందువల్ల కావచ్చులేకశాల్తీ వేతనాల రూపాన్ని (అంటే,  చెల్లింపు జరిగింది ఉత్పాదితానికే కాని తన శ్రమశక్తికి
కాదు అనే దాన్ని)శ్రామికుడు తీవ్రమైనదిగా భావిస్తాడుఅందువల్ల సరుకు అమ్మకం ధర అలాగే ఉండితన వేతనం తగ్గిస్తే తిరగబడతాడు.
కార్మికులు ముడిపదార్ధాల ధరల్నీ,తయారైన వస్తువుల ధరల్నీ జాగ్రత్తగా గమనిస్తారుతమ యజమానికొచ్చే లాభాల్ని కచ్చితంగా అంచనాగడతారు.
యంత్రాల వల్ల కలిగే ప్రయోజనాల్లో వాటా ఉండదు
 కార్మిక సంఘాలు వేతనాల్ని నిలబెట్టుకోవడానికి మెరుగైన యంత్రాల వల్ల కలిగే ప్రయోజనాల్లో వాటా కోసం ప్రయత్నిస్తాయి.
పెట్టుబడిదారుడు  తిప్పికొడతాడు. అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నాన్ని పరిశ్రమ పురోగమనంపై పన్నుల విధింపు అంటూ ఆక్రోశిస్తాడుశ్రమ ఉత్పాదకత ఏమాత్రమూ శ్రామికునికి సంబంధిం చింది కాదు అని ప్రకటిస్తాడు.

ఉదాహరణకి, 1861 అక్టోబర్ 26 లండన్ శ్టాండర్డ్ పత్రికలో జాన్ బ్రైట్  అండ్ కంపెనీ సంబంధించిన కోర్ట్ విచారణ వార్త వచ్చిందిఅది తివాచీ నేసేవాళ్ళ కార్మిక సంఘాల బెదిరింపులకు వ్యతిరేకంగా వేసిన దావా.బ్రైట్ భాగస్వాములు కొత్తయంత్రాల్ని ప్రవేశపెట్టారు.ఫలితంగా మునుపు 160 గజాల తివాచీ తయారయ్యే కాలంలోనే ఇప్పుడు 240 గజాల తివాచీ ఉత్పత్తవుతున్నది.  యంత్రాల మెరుగుదల కోసం యజమాని పెట్టుబడివల్ల వచ్చిన లాభాల్లో వాటా కోరే హక్కు పనివాళ్ళకు ఉండదుదాని ప్రకారం కంపెనీ వాళ్ళు గజానికి ఇస్తున్న 1 1/2 పెన్నీ కాకుండాతగ్గించి 1 పెన్నీయే ఇస్తామని ప్రతిపాదించారుపనివాళ్ళు అంతే శ్రమతో మునుపు ఎంత సంపాదించారో అంతే సంపాదిస్తారు.
వచ్చే పోస్ట్: వేతనాల్లో జాతీయ వ్యత్యాసాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి