24, నవంబర్ 2018, శనివారం

'శ్రమనిధి 'అనబడేది


విభాగం 5.'శ్రమనిధి 'అనబడేది
పెట్టుబడి స్థిర పరిమాణం కాదు
పెట్టుబడి స్థిర పరిమాణం కాదు - అని మన పరిశీలనలో తేలింది. అది సమాజ సంపదలో ఒక భాగం. తాజా అదనపువిలువ రెవిన్యూలోకీ, అదనపు పెట్టుబడిలోకీ నిరంతరం విడివడుతూ, మారుతూ ఉంటుంది. క్రియాత్మక పెట్టుబడి ఇవ్వబడినా, శ్రమ శక్తీ, సైన్సూ, భూమీ (మనిషితో నిమిత్తం లేకుండా ప్రకృతి సమకూర్చిన పరిస్థితులన్నీ) క్రియాత్మక పెట్టుబడిలో ఇమడ్చబడతాయి. వ్యాకోచించే శక్తులు అవుతాయి. దానికి కొన్ని పరిమితుల్లో దాని సొంత పరిమాణంతో సంబంధంలేకుండా కార్యాచరణకి అవకాశం కలిగిస్తాయి. కాబట్టి పెట్టుబడి స్థిర పరిమాణం కాదు.
అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞుల శ్రమ నిధిసిద్ధాంతం
అశాస్త్రీయ అర్ధ శాస్త్రజ్ఞులుశ్రమ నిధిసిద్దాంతాన్ని ప్రవేశపెట్టి, ప్రచారం చేశారు. వేతనాలు చెల్లించడానికి ఒకస్థిర నిధి’ ఉంటుందనేది దీని సారాంశం. నియోగించబడిన కార్మికుల సంఖ్యచేత భాగిస్తే వేతనాల స్థాయి తెలుస్తుంది అని కొందరు వాదించారు.  ఇంకొందరు నిధి మొత్తాన్ని, స్థిరవేతనంతో భాగిస్తే శ్రామికుల సంఖ్య తెలుస్తుందని తేల్చారు. వాళ్ళూ వీళ్ళూ కూడా సంచయనం రేటుని నిర్ణయించే అంశాలు అన్నిటినీ విస్మరించారు - అని మార్క్ విమర్శించాడు
అశాస్త్రీయ ఆర్ధిక వేత్తలు పెట్టుబడిని నిర్దిష్ట పరిమాణంగా పరిగణంచారు. ఆవిధంగా అస్థిర పెట్టుబడి, స్థిర పరిమాణంగా వాళ్ళకి అగపడుతుంది. శ్రమనిధి అనబడేది అదే. 'ఫలానింత మొత్తం కార్మికులకి చెల్లించడానికి కేటాయించబడుతుంది - అంటారు వాళ్ళు.  కార్మికులు ఎంత ఎక్కువమంది ఉంటే, ఒక్కొక్కళ్ళ వాటా అంత తగ్గుతుంది. ఎంత తక్కువమంది ఉంటే, ఒక్కొక్కళ్ళ వాటా అంత ఎక్కువ ఉంటుంది.'
ఆవిధంగా సాంప్రదాయ అర్ధశాస్త్రం సామాజిక పెట్టుబడిని ఒక స్థిరమైన సామర్ధ్య స్థాయి గల స్థిర పరిమాణంగా భావించడానికి ఇష్టపడింది. ఇది పరిశీలన చెయ్యకుండా తేల్చిన  నిర్ధారణ (prejudice).
బెంథాం పిడివాదం
దీన్ని ఒక పిడివాదంగా మొట్టమొదట స్థాపించినవాడు జెరెమీ బెంథాం. అతనొక పసలేని పాండిత్య ప్రకర్షకుడు, ఈ పిడివాదాన్ని అనుసరించి ఉత్పత్తి ప్రక్రియ యొక్క అత్యంత సామాన్యమైన విషయాల్ని సైతం తెలుసుకోజాలం. ఉదాహరణకి, దాని ఆకస్మిక వ్యాకోచ సంకోచాలు. అంతెందుకు, అసలు సంచయనాన్ని ఊహించడమే అసాధ్యం అవుతుంది.
అర్ధశాస్త్రజ్ఞుల కట్టుకధలు
పిడివాదాన్ని బెంథాంతొ పాటు మాల్థూస్, జేంస్ మిల్, మాకుల్లాక్ మొదలైన వాళ్ళు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించడానికి వాడుకున్నారు -. మరీ ముఖ్యంగా పెట్టుబడిలో ఒకభాగం అయిన అస్థిరపెట్టుబడిని- శ్రమశక్తిలోకి మార్చబడే భాగాన్ని- ఒక స్థిర పరిమాణంగా చూపడానికి వాడుకున్నారు. అస్థిర పెట్టుబడి భౌతికాంశంకార్మికుల జీవనాధార సాధనాల మొత్తం, లేక శ్రమనిధి అనబడేది సామాజిక సంపదలో భాగమనీ, సహజ సూత్రాలచేత నిర్ణయించబడి, మార్పు చెందనిదనీ కట్టుకధలు చెప్పారు.
కార్మికుల సంఖ్య-శ్రమ శక్తి ధర
స్థిరపెట్టుబడిగా పనిచెయ్యాల్సిన సామాజిక సంపదని చలనంలో పెట్టడానికి అంటే, దాన్ని భౌతిక రూపంలో ఉత్పత్తిసాధనాలుగా వ్యక్తంచెయ్యడానికి, ఒకనిర్దిష్ట పరిమాణంగల సజీవ శ్రమ రాసి అవసరంవుతుంది. పరిమాణం ఎంతనేది సాంకేతికంగా నిర్ణయమవుతుంది. అయితే శ్రమశక్తి పరిమాణాన్ని చలనంలో పెట్టడానికి ఎంతమంది కార్మికులు కావాలో తెలియజెయ్యదు. ఎందుకంటే, వైయక్తిక శ్రమశక్తి దోపిడీ స్థాయిని బట్టి సంఖ్య మారుతుంది. దోపిడీ స్థాయి ఎక్కువయ్యేకొద్దీ, కార్మికుల సంఖ్య తగ్గుతుంటుంది, దోపిడీ స్థాయి తగ్గే కొద్దీ కార్మికుల సంఖ్య పెరుగుతుంటుంది. అలాగే శ్రమ శక్తి ధరను కూడా తెలియజేయదు- అస్థిరమైన ఆధర యొక్క కనీస పరిమితిని మాత్రమే తెలుపుతుంది. పరిమితికూడా చాలా అస్థిరమైందే.
పిడి వాదంలోని వాస్తవాలు ఇవి:
1.ఒకపక్క, సామాజిక సంపద శ్రమ చెయ్యనివని సుఖ,భోగ సాధనాలుగానూ, ఉత్పత్తి సాధనాలుగానూ విభజించడంలో జోక్యం చేసుకునే హక్కు కార్మికునికి లేదు.
2. మరొకపక్క, అనుకూలమైన, అసాధారణ సందర్భాల్లో మాత్రమే సంపన్నుల ఆదాయం నించి శ్రమ నిధి అనబడేదాన్ని పెంచుకోగల శక్తిని కలిగి ఉంటాడు. 
శ్రమనిధి కుండే పెట్టుబడిదారీ పరిమితుల్ని సహజమైన,సామాజికమైన పరిమితులుగా చిత్రించే ప్రయత్నం పునరుక్తి తప్ప మరేమీ కాదు. ఉదాహరణకి ప్రొ.ఫాసెట్ - ఒక దేశ చలామణీ పెట్టుబడే ఆదేశ వేతననిధి. కాబట్టి, ఒక్కొక్క కార్మికుడు పొందే  సగటు వేతనాన్ని లెక్కించాలనుకుంటే, మనం ముందుగా పెట్టుబడి మొత్తాన్ని శ్రామిక జనభా సంఖ్య బెట్టి భాగించాలి.
దీని అర్ధం: వాస్తవంగా చెల్లించబడిన వైయక్తిక వేతనాల్ని ముందుగా కూడాలి. కూడగా వచ్చిన మొత్తమే శ్రమనిధి అని, భగవంతుడూ, ప్రకృతీ నిర్ణయించి ప్రసాదించిన శ్రమనిధి అని నొక్కి వక్కాణించాలి. ఆవిధంగా రాబట్టిన మొత్తాన్ని కార్మికుల సంఖ్య చేత తిరిగి భాగించాలి - సగటున ఒక్కో కార్మికుడికి ఎంతవస్తుందో తేల్చడానికి. తప్పు దోవ పట్టించడానికి ఎంత తెలివి. అసలు విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎటువంటి మోసం.
అదే ధోరణిలో ఆయనిలా అంటాడు: 
ఇంగ్లండ్ లో ఏటేటా పొదుపు చేయబడిన సంపద మొత్తం రెండు భాగాలుగా విభజించబడింది; ఒక భాగం మన పరిశ్రమని నిర్వహించే నిమిత్తం నియోగించబడింది. రెండో భాగం విదేశాలకు ఎగుమతిచెయ్యబడింది... ఏటేటా పొదుపుచెయ్యబడిన సంపదలో ఒకభాగం మాత్రమే, అదీ పెద్ద భాగమేమీ కాదు, మన సొంత దేశంలో పెట్టుబడిగా పెట్టబడింది.”
సమానకం ఇవ్వకుండా ఇంగ్లండ్ కార్మికులనించి గుంజబడి, అంటే అపహరించబడి ప్రతి ఏటా కూడుతున్న అదనపు ఉత్పాదితంలో భారీభాగం ఆవిధంగా ఇంగ్లండ్ లో కాకుండా విదేశాల్లో పెట్టుబడిగా ఉపయోగించబడుతున్నది. అయితే అలా ఎగుమతిచేయబడిన అదనపు పెట్టుబడితో పాటు దైవమూ, బెంథామూ కనిపెట్టిన 'శ్రమనిధి 'లో ఒకభాగం కూడా ఎగుమతి చెయ్యబడుతుంది.  

18, నవంబర్ 2018, ఆదివారం

పెట్టుబడి సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు


అధ్యాయం 24.  అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం

విభాగం 4. పెట్టుబడి సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు
అదనపువిలువ పెట్టుబడిగానూ, ఆదాయంగానూ విడివడే నిష్పత్తితో నిమిత్తంలేకుండా, సంచయన పరిమాణాన్ని నిర్ణయించే ఇతర అంశాలు.
1.శ్రమశక్తిని దోపిడీ చేసే స్థాయి
2.శ్రమ ఉత్పాదకత
3.నియోగించిన పెట్టుబడికీ, వినియోగమైన పెట్టుబడికీ మధ్య పెరిగే వ్యత్యాసం
4.అడ్వాన్స్ చేసిన పెట్టుబడి పరిమాణం
అదనపువిలువ పెట్టుబడిగానూఆదాయంగానూ ఏనిష్పత్తిలో విభజితమవుతుందో తెలిస్తేసంచయనమయిన పెట్టుబడి పరిమాణం స్పష్టంగా అదనపువిలువ యొక్క పరమ పరిమాణాన్ని బట్టి ఉంటుందిఉదాహరణకి ,అదనపు విలువలో 80 శాతం పెట్టుబడిలోకి మార్చబడిందనీ, 20 శాతం వినియోగించుకోబడిందనీ అనుకుందాంఅదనపు విలువ మొత్తం 3,000 పౌన్లయితే సంచయనమైన పెట్టుబడి 2,400 పౌన్లు అవుతుందిఅది 1,500 పౌన్లయితే ఇది 1,200 పౌన్లవుతుందికాబట్టి అదనపువిలువ రాశిని నిర్ణయించే అంశాలన్నీ సంచయనం పరిమాణాన్ని నిర్ణయించడంలో పనిచేస్తాయిసంచయనానికి సంబంధించికొత్త దృక్కోణాల్ని చూపే మేరకు   అంశాలన్నిటినీ మరొకసారి సంక్షిప్తంగా చూద్దాం. 
1.శ్రమశక్తిని దోపిడీ చేసే స్థాయి
అదనపువిలువ రేటు శ్రమశక్తి దొఫిడీ స్థాయిని బట్టి ఉంటుంది అని గుర్తుబెట్టుకోవాలిరాజకీయ అర్ధశాస్త్రం  వాస్తవానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుందిఎంతంటేఅప్పుడప్పుడుశ్రమ ఉత్పాదకత పెరుదుదల వల్ల కలిగే సంచయనవేగంశ్రామికుణ్ణి దోపిడీ చేయడం వల్ల పెరిగే సంచయన్ వేగంతో సమానం చేసేటంత ప్రాధాన్యతనిస్తుందిఅదనపు విలువ ఉత్పత్తి గురించిన అధ్యాయాల్లో వేతనాలు శ్రమ శక్తి విలువకి కనీసం సమానంగానన్నా ఉన్నట్లు భావించాంఅయినప్పటికీఆచరణలో    వేతనాల్ని బలవంతంగా అంతకన్నా తగ్గించడం అనేది  చాలా ప్రముఖ పాత్ర నిర్వహిస్తుందికాబట్టి ఇక్కడ కాసేపు ఆగిదాన్ని గురించి ఆలోచించాలి.వాస్తవానికి అది కొన్ని పరిమితుల్లో కార్మికుని వినియోగావసరాల నిధిని పెట్టుబడి సంచయన నిధిగా మారుస్తుందిజాన్ స్టువర్ట్ మిల్ ఇలా అంటాడువేతనాలకి ఉత్పాదక శక్తి ఉండదుఅవి ఉత్పాదక శక్తి యొక్క ధరలువాస్తవానికి అది కొన్ని పరిమితుల్లో కార్మికుని వినియోగావసరాల నిధిని పెట్టుబడి సంచయన నిధిగా మారుస్తుంది. శ్రమతో పాటువేతనాలు సరుకుల ఉత్పత్తికి దోహదం చెయ్యవుపరికరాలతో పాటువాటి ధర ఎలా దోహదం చెయ్యదో అలాగేకొనకుండానే  శ్రమ లభిస్తేవేతనాల్ని రద్దు పరచవచ్చు(Essays on Some Unsettled Questions of Political Economy,‖ Lond., 1844, p. 90.) అయితే కార్మికులు గాలి తిని బతీక గలిగితేవాళ్ళని  ధరకీ కొనడం కుదరదుకాబట్టి గణిత భాషలో వాళ్ళ ధరకి ఒక పరిమితి సున్నఆసున్నాకి చేరువగా రాగలమే గానిదాన్ని చేరడం సాధ్యం కాదు సున్నా వైపుకి శ్రమ ధరని వెనక్కి నెట్టడమే,పెట్టుబడి యొక్క నిరంతర పోకడనిరంతర ధోరణి.
ఆదర్శ కార్మికులు
18  శతాబ్దానికి చెందిన ఒక రచయిత తన Essay on Trade and Commerceలో  ఇంగ్లండ్ వేతనాల్ని ఫ్రెంచ్డచ్  వేతనాల స్థాయికి బలవంతంగా తగ్గించడమే ఇంగ్లాండ్ చారిత్రక కర్తవ్యం అన్నాడు. అదే పద్ధతిలో 1866 డిశంబర్, 1867 జనవరి The Times పత్రిక బెల్జియం గని కార్మికుల సంతోషకరమైన స్థితిని చిత్రించింది.యజమానులకోసం తాము బతకడానికి కచ్చితంగా ఎంతకావాలో అంతకన్న ఎక్కువ అడగరనీతీసుకోరనీ రాసిందిఅలా  గనియజమానుల మనసులోని మాటల్ని ప్రచురించిందిఅయితే బెల్జియం కార్మికులు ఆదర్శ కార్మికులుగా  పత్రికలో గుర్తింపు పొందడానికి చాలా బాధ పడాల్సివచ్చింది. 1867 ఫిబ్రవరి మొదట్లో జవాబు దొరికిందిబెల్జియం కార్మికుల సమ్మె మెర్సియనీలో తుపాకీ తూటాలతో అణచబడింది.

ఇంగ్లిష్ పెట్టుబడిదారీ విధానం యొక్క అంతర్గత ఆత్మ రహస్యాన్ని బహిర్గతం చేశాడన్నమాటమిగతా విషయాలతో పాటు అమాయకంగా ఇలా చెబుతాడుమన పేదలు (కార్మికులకి బదులు అయన వాడే మాటవిలాసవంతంగా బతికేట్లయితేశ్రమ ప్రియం అవుతుందికార్ఖానా దారులు అనుభవించే బ్రాందీజిన్టీపంచదారవిదేశీ పళ్ళుఘాటైన బీరు,  అద్దకం బట్టలునశ్యంపుగాకు వగయిరా వాడితే శ్రమ ధర పెరుగుతుంది.
అతను నార్త్ ఆంప్టన్ షైర్ కార్ఖానాదారుడు మూలగడాన్ని కోట్ చేశాడుశ్రమ ఇంగ్లండ్ లో కంటే ఫ్రాన్స్ లో మూడో వంతు చౌక.కారణం అక్కడ పనివాళ్ళు కష్టపడి పనిచేస్తారువాళ్ళ తిండికీబట్టలకీ తక్కువ ఖర్చు చేస్తారువాళ్ల ముఖ్య ఆహారం బ్రెడ్పళ్లుఆకులూదుంపలుఎండు చేపలుఅరుదుగా మాత్రమే మాంసం తింటారుగోధుమలు ప్రియంగా ఉన్నప్పుడుబహుకొద్ది బ్రెడ్ మాత్రమే తింటారుమన వ్యాసకర్త కొన్ని మాటలు కలుపుతున్నాడు 
వాళ్ళు తాగేది నీళ్ళుగానీచౌకరకం సారాగానీ తాగుతారుకాబట్టి వాళ్ళు చలాతక్కువ ఖర్చు బెడతారు.  ఇంగండ్ లో వీటిని అమలు చెయ్యడం చాలా కష్టమేకాని ఫ్రాన్స్ లోనూహాలాండ్ లోనూ అమలు పరచబడ్డాయి కాబట్టి ఇక్కడకూడా అసాధ్యం కాక పోవచ్చు.
మూడో జర్మన్ ముద్రణకు నోట్అప్పటినుండీ ప్రపంచ మార్కెట్లో స్థిరపడ్డ పోటీ వల్లఈనాడు ఎంతో ముందుకు పోయాంస్టేపిల్టన్ అనే పార్లమెంట్ సభ్యుడు ఇలా అన్నాడుచైనా గొప్ప పారిశ్రామిక దేశంగా ఎదిగినట్లయితేఐరోపా కార్ఖానా జనాభా తమ పోటీ దారుల స్థాయికి దిగిపోకుండా పోటీలో ఎలా తట్టుకోగలరో నాకు తట్టడంలేదు (టైంస్సెప్టెంబర్ 3, 1873). ఇంగ్లండ్ పెట్టుబడి దారుల కాంక్షించే లక్ష్యం ఐరోపా ఖండ వేతనాలు కానేకావుచైనా వేతనాలు మాత్రమే.
18  శతాబ్దం చివరలోనూ, 19  శతాబ్దంతొలి పదేళ్ళలోనూ ఇంగ్లిష్ రైతులూభూస్వాములూ వ్యవసాయ కూలీలకు పరమ కనీస వేతనాన్ని అమలుపరిచారు - కనీసం కన్నా తక్కువ వేతన రూపంలోనూమిగిలినదాన్ని పేదలకి ప్రభుత్వంచర్చ్ ఇచ్చే వాటి రూపంలోనూ ఇవ్వడంద్వారా.అప్పటి ఒక బూర్జువా రచయిత ఇలా అన్నాడు - ఆదేశంలో రైతులు ఒక గౌరవప్రదమైన వర్గాన్ని ఏళ్ళతరబడి పేద గృహాల్లో ఆశ్రయం పొందేట్లు దిగజార్చారుతన ఆదాయాన్ని పెంచుకుంటూనేశ్రామికులకు ఏమాత్రం సంచయనం లేకుండా నిరోధించాడుమన కాలంలో అదనపు విలువ ఏర్పాటులోపెట్టుబడి సంచయన నిధి ఏర్పాటులో కార్మికుల’ వినియోగవసర నిధిని నేరుగా కాజెయ్యడం’ అనేది పోషించిన పాత్రని స్వదేశీ పరిశ్రమ చూపించింది విషయానికి సంబంధించిన వాస్తవాల్ని తర్వాత చెబుతాము.   పరిశ్రమ శాఖలోనైనా స్థిర పెట్టుబడిలో భాగమైన శ్రమ సాధనాలు శ్రామికుల సంఖ్యకి సరిపోయినన్ని  ఉండాలిఅయినప్పటికీదాని అర్ధం శ్రామికుల సంఖ్య పెరిగే నిష్పత్తిలోనే ఆస్థిర పెట్టుబడి భాగం పెరగక తప్పదు అని కాదుఉదాహరణకి ఒక ఫాక్టరీలో 100 మంది రోజుకి 8 గంటల చొప్పున 800 పని గంటలు అవుతాయిపెట్టుబడి దారుడు ఈమొత్తాన్ని 1200 గంతలకు పెంచాలనుకుంటేఅతను మరొక 50 మంది కార్మికుల్ని పెట్టవచ్చుఅందుకు కొత్తకార్మికులకే కాకుండావాళ్ళు వాడే శ్రమ సాధనాలకోసం కూడా మరికొంత పెట్టుబడి అడ్వాన్స్ పెట్టాల్సి వస్తుందిఅలాకాకుండాఉన్న 100 మంది చేతనే రోజుకి 12 గంటలు పనిచేయిస్తే ఉన్న శ్రమ సాధనాలే సరిపోతాయికాకపోతే అవి మరింత త్వరగా వినియోగమవుతాయిఆవిధంగా శ్రమ తీవ్రత వల్ల  ఏర్పడ్డ  అదనపు శ్రమ (additional labour), దానికి అనుగుణంగా స్థిరపెట్టుబడిభాగాన్ని పెంచకుండానేఅదనపు ఉత్పాదితాన్నీఅదనపు విలువని పెంపొందింపచేస్తుంది.
 వెలికితీత పరిశ్రమలు,గనులు మొదలైన వాటిలో ముడిపదార్ధాలకు పెట్టే పెట్టుబడి ఉండదుఈసందర్భంలో శ్రమ పదార్ధం గతశ్రమ ఉత్పాదితం కాదుఅది ప్రకృతి ఉచితంగా సమకూర్చే పదార్ధం - లోహాలూఖనిజాలూ బొగ్గూరాళ్ళూ లాగా పరిశ్రమల్లో స్థిర పెట్టుబడి దాదాపు పూర్తిగా శ్రమ సాధనాలే సాధనాలు ఎక్కువ శ్రమని (ఉదాహరణకికార్మికుల రాత్రి పగలూ షిఫ్టుల్నిఇముడ్చుకోగలవుఇతర పరిస్థితులన్నీ స్థిరంగా  ఉన్నప్పుడుఉత్పాదితం రాశీవిలువా వ్యయమైన శ్రమకి అనులోమానుపాతంలో పెరుగుతాయిఉత్పత్తి ఆరంభమైన తొలి రొజు లాగేప్రకృతీ మనిషీ  పెట్టుబడి భౌతికాంశాల సృష్టి కర్తలుగా కలిసి పనిచేస్తున్నాయి. మనిషి శ్రమ శక్తికి ఇచ్చే శ్రమని పెంచగలిగే స్వభావం ఉంటుంది. అందువల్ల స్థిరపెట్టుబడిలో పెరుగుదల లేకుండానే, సంచయనం పరిధి విస్తరించగలదువ్యవసాయంలో  మరిన్ని విత్తనాలూ  మరింత ఎరువూ అడ్వాన్స్ పెట్టకుండా సేద్యభూమిని పెంచడం వీలవదు అడ్వాన్స్ ఒక సారి పెడితేనేల  చేసే పని ఉత్పాదితం పరిమాణం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందిఅంతకు ముందున్నంత మంది కార్మికులే చేసే ఎక్కువ శ్రమ ఆవిధంగా శ్రమసాధనాలకు కొత్త అడ్వాన్స్ కోరకుండానేభూసారాన్ని పెంచుతుంది. తాజా పెట్టుబడి ప్రమేయం లేకుండానేప్రకృతి  మీద ప్రత్యక్ష మానవ చర్య మరింత సంచయనానికి మరొకమారు వనరు అయింది. 
చివరగా, వస్తు తయారీ రంగంలో శ్రమ మీద అదనపు వ్యయానికి అనుగుణమైన ముడిపదార్ధాల అదనపు వ్యయం ఉండి తీరాలిఅయితే శ్రమ సాధనాలకు అలాంటి వ్యయం అవసరం ఉండదువెలికితీత పరిశ్రమలూవ్యవసాయమూ వస్తూత్పత్తి పరిశ్రమకి ముడి పదార్ధాల్నీశ్రమ సాధనాల్నీ సమకూరుస్తాయిఅందువల్ల  వెలికితీత పరిశ్రమావ్యవసాయమూ  అదనపు పెట్టుబడి అడ్వాస్ చెయ్యకుండానే అదనపు ఉత్పాదితాన్ని సృజిస్తాయికాబట్టి వస్తూత్పత్తి పరిశ్రమకి ప్రయోజనం కలుగుతుంది.2. సామాజిక శ్రమ ఉత్పాదక స్థాయి.
శ్రమ ఉత్పాదకత పెరిగితే ఉత్పాదితాల రాసి పెరుగుతుందివాటిలో విలువతో పాటు  అదనపువిలువ కూడా ఇమిడిఉంటుందిఅదనపు విలువ రేటు స్థిరంగా ఉంటేలేదూ ఒకవేళ తగ్గినా ఉత్పాదకశక్తి  పెరిగే దానికన్నా నెమ్మదిగా తగ్గుతున్నంత కాలమూ అదనపు ఉత్పాదితం రాశి పెరుగుతూ ఉంటుంది ఉత్పాదితం అదనపు పెట్టుబడిలోకీఆదాయం లోకీ విభజన ఉన్నదున్నట్లే ఉంటేసంచయననిధి తగ్గకుండానేపెట్టుబడిదారుడి వినియోగనిధి పెరగవచ్చువినియోగ నిధిని తగ్గించడం ద్వారా కూడాసంచయన నిధి సాపేక్ష పరిమాణం పెరగవచ్చుఅదే సమయంలో సరుకులు చౌక అవడం వల్ల అంతకుముందు లాగానోఅప్పటికన్న ఎక్కువగానో వినియోగ వస్తువులు పెట్టుబడిదారుడికి లభిస్తాయిఅయితే పెరిగే శ్రమ ఉత్పాదకతతో పాటుశ్రామికుడు కూడా చౌక అవుతాడుఅందువల్లనిజ వేతనాలు పెరుగుతున్నా గానిఅదనపు విలువ రేటు పెరుగుతుందిశ్రమ ఉత్పాదకత పెరుగుదలకి అనుగుణంగా  నిజవేతనాలు పెరగవుఅందువల్లఅదే అస్థిర పెట్టుబడి విలువ మరింత శ్రమ శక్తినిఅందువల్ల మరింత శ్రమని చలనంలో పెడుతుందిఅదే స్థిర పెట్టుబడి విలువ మరిన్ని ఉత్పత్తి సాధనాల్ని - అంటే మరిన్ని శ్రమ సాధనాల్నిశ్రమ పదార్ధాల్నిఉపపదార్ధాల్ని - ఇముడ్చుకుంటుందిఅందువల్లస్థిర పెట్టుబడి మరింత ఉపయోగపు విలువవిలువల ఉత్పత్తికి కావలసిన అంశాల్నివాటితో పాటు ఎక్కువ శ్రమని ఇముడ్చుకోగల అంశాల్నీ సరఫరా చేస్తుంది.  అందువల్లఅదనపు పెట్టుబడి విలువ స్థిరంగా వున్నాఒకవేళ తగ్గుతున్నా కూడావేగం పెంచుతూ సంచయనం ఇంకా జరుగుతూనే ఉంటుందిపునరుత్పత్తి స్థాయి పాదార్ధికంగా విస్తరించడమే కాక అదనపు విలువ ఉత్పత్తి కూడా పెరుగుతుంది - అదనపు పెట్టుబడి విలువకన్నా వేగంగా.  
శ్రమ ఉత్పాదక శక్తి పెరుగుదల ప్రభావం అప్పటికే ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న మొదటి పెట్టుబడి మీద కూడా ఉంటుందిక్రియాత్మక స్థిర పెట్టుబడిలో ఒక భాగం యంత్రాల వంటి శ్రమ సాధనాలుఅవి చాలా కాలం పాటు పనిచేస్తాయిత్వరగా వినియోగం అవవుకాబట్టి చాలాకాలం వాటిని మార్చాల్సిన అవసరం ఉండదువాటి స్థానంలో కొత్తవాటిని పెట్టాల్సిన పని ఉండదుఅయితే ప్రతి ఏడూ కొన్ని శ్రమ సాధనాలు అరిగిపోయిపనికిరావుపనిచేసే పరిమితిని దాటతాయిఅటువంటి వాటినే కొత్తవి తిరిగి వాటిస్థానంలో పెట్టాల్సి వస్తుంది.  శ్రమ సాధనాలు వాడకం అవుతున్న సమయంలోశ్రమ ఉత్పాదకత పెరిగితేపాత వాటి స్థానంలో మరింత సమర్ధవంతమైనచౌకయిన యంత్రాలూపరికరాలూఇతర ఉపకరణాలూ పెట్టబడతాయి.( సైన్సూసాంకేతికతల నిరంతరాయమైన అభివృద్ధి వల్ల శ్రమ ఉత్పాదకత పెరుగుతూ పోతుంది). పాత పెట్టుబడి మరింత ఉత్పాదక రూపంలో పునరుత్పత్తి అవుతుంది.
స్థిరపెట్టుబడిలో మరొక భాగం ముడి పద్దార్ధమూఉపపదార్ధాలూ భాగం సంవత్సరం లోపే పునరుత్పత్తి చేయబడుతుందివ్యవసాయంలో ఉత్పత్తయ్యేవటిలో ఎక్కువ భాగం  ఉత్పత్తవడానికి సంవత్సరం పడుతుందిఅందువల్లకొత్తగా వచ్చే ప్రతి  మెరుగుదలాకొత్త పెట్టుబడి పైనే కాక అప్పటికే పనిచేస్తున్న పెట్టుబడి మీద కూడా ఏక కాలంలో పనిచేస్తుంది. 
ఉదాహరణకి,దారం వడికే ఒక ఇంగ్లండ్ పనివాడూఒక చైనా పనివాడూ ఒకే గంటలుఒక శ్రమ తీవ్రతతో పనిచేయ్యవచ్చుఅప్పుడు ఒక వారంలోఇద్దరూ సమాన విలువలు సృజిస్తారు. సమానత్వం ఉన్నాగానిభారీ స్వయంచాలక యంత్రంతో పనిచేసే ఇంగ్లండ్  వాని వారం ఉత్పాదితం విలువకీరాట్నం మీద వడికే చైనావాని వారం ఉత్పాదితం విలువకీ భారీ వ్యత్యాసం ఉంటుందిచైనావాడు పౌను పత్తి వడికే సమయంలోనేఇంగ్లాండ్ వాడు ఎన్నో వందల పౌన్ల పత్తి వడుకుతాడుఎన్నో వందల రెట్లు ఎక్కువగా వున్న పాతవిలువలమొత్తం అతని ఉత్పాదితం విలువని పెంచుతుందిఅతని ఉత్పాదితంవిలువలో పాతవిలువలు ప్రయోజనకరమైన కొత్త రూపంలో పునర్దర్శన మిస్తాయిఆవిధంగా అవి కొత్తగా పెట్టుబడిగా పనిచేస్తాయి.
ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్పినట్లు: 1782 లో అంతకుముందు మూడేళ్ల ఉన్ని పంట,  పనివాళ్ళు లేక అలాగే పడివుందికొత్తగా యంత్రాలు వచ్చి వడకక పోయిఉంటేఆ పత్తి మొత్తం మూలనబడి ఉండేది.

యంత్రరూపంలో వస్తూత్వం చెంది ఉన్న శ్రమ తక్కువమంది శ్రామికులుసాపేక్షంగా తక్కువ సజీవ శ్రమని కలిపి  ఉన్నిని ఉత్పాదకంగా వినియోగించి దానికి కొత్త విలువని చేరుస్తుందిఅంతేకాకుండాపాతవిలువని నూలు వగైరా రూపంలో భద్రపరుస్తుంది.  అదే సమయంలో అధిక ఊలు పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుందిఅందుకు అవసరమైన సాధనాల్ని సమకూర్చింది.కొత్త విలువని సృజిస్తూనేఉన్న పాతవిలువని భద్రపరచడం సజీవ శ్రమ యొక్క సహజ ధర్మంఅందువల్లదాని ఉత్పత్తిసాధనాల సమర్ధతవిస్తృతివిలువల పెరుగుదల కారణంగాఅందువల్ల దాని ఉత్పాదకత పెరుగుదలని అనుసరించి  సంచయనం పెరగడంతో శ్రమ నిరంతరం పెరిగే పెట్టుబడి విలువని నిరంతర నూతన రూపంలో భద్రపరుస్తుందిశాశ్వత పరుస్తుందిశ్రమ కున్న  సహజ శక్తి పెట్టుబడియొక్క శక్తిగా అగపడుతుంది - అది పెట్టుబడిలో భాగంగ కలిసి పోయిఉన్నందువల్లసామాజిక శ్రమ యొక్క ఉత్పాదక శక్తులు పెట్టుబడి యొక్క సహజ లక్షణాలుగా కనిపించినట్లేపెట్టుబడిదారుడు నిరంతరం  అదనపు శ్రమని స్వాయత్తం చేసుకోవడం అనేది పెట్టుబడి యొక్క నిరంతర స్వయం విస్తరణగా కనిపించినట్లేఇది కూడా కనిపిస్తుంది.
సాంప్రదాయ అర్ధశాస్త్రం పునరుత్పత్తికి సంబంధించి  ప్రధానమైన అంశాన్ని గ్రహించలేదుకారణం శ్రమ ప్రక్రియ విశ్లేషణావిలువను సృజించే ప్రక్రియ విశ్లేషణా లోపభూయిష్టంగా ఉండడమేరికార్డో చెప్పినదాన్ని చూస్తే ఇది తేటతెల్లమవుతుంది.
సాంప్రదాయ అర్ధశాస్త్రం పునరుత్పత్తికి సంబంధించి  ప్రధానమైన అంశాన్ని గ్రహించలేదుకారణం శ్రమ ప్రక్రియ విశ్లేషణావిలువను సృజించే ప్రక్రియ విశ్లేషణా లోపభూయిష్టంగా ఉండడమేరికార్డో చెప్పినదాన్ని చూస్తే ఇది తేటతెల్లమవుతుందిఉదాహరణకిఆయనిలా అంటాడుఉత్పాదక శక్తిలో ఎటువంటి మార్పు సంభవించినా 'పదిలక్షలమంది కార్ఖానా కార్మికులు ఎల్లప్పుడూ ఒకే విలువని ఉత్పత్తిచేస్తారు.' ఇది సరైనదే,  కాని ఏపరిస్థితుల్లోవాళ్ళ శ్రమ విస్తృతీతీవ్రతా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే.
వారందరిలో ఒకే ఉత్పాదక శక్తి ఉండదువేర్వేరు ఉత్పాదక శక్తులుంటాయికాబట్టి వాళ్ళు వేర్వేరు ఉత్పత్తిసాధనాల రాశుల్ని ఉత్పాదితాలుగా మారుస్తారు.తద్వారా  ఉత్పాదితాల్లో వేర్వేరు విలువ రాశుల్ని భద్రపరుస్తాయిఅలా చెయ్యకుండానికి ఆటంకం ఉండదు.అందువల్ల తయారుచెయ్యబ్డే ఉత్పాదితాల విలువలు బాగా భిన్నంగా ఉంటాయి. (రికార్డో తన కొన్ని నిర్ధారణల్లో  వాస్తవాన్ని  గమనించడు).
3.నియోగించిన పెట్టుబడికీ, వినియోగమైన పెట్టుబడికీ మధ్య పెరిగే వ్యత్యాసం
 పెట్టుబడి పెరుగుదలతో నియోగమైన పెట్టుబడికీవినియోగమైన పెట్టుబడికీ వ్యత్యాసం పెరుగుతుందివేరే  మాటల్లోభవనాలూయంత్రాలూమురుగునీటి గొట్టాలూ పనిచేసే పశువులూ వంటి శ్రమ సాధనాల విలువారాశీ పెరుగుతుంది ఉత్పాదితాలకు విలువని కలపకుండానే  శ్రమ సాధనాలు   నిరంతరాయంగా పునరావృతమయ్యే ఉత్పత్తి ప్రక్రియలోఉత్పాదితాల తయారీలో ఉపకరిస్తాయిప్రత్యేకమైన ప్రయోజనక ఫలితాల్ని సాధించడానికిఆ శ్రమ సాధనాలు ఎక్కువ కాలమోతక్కువకాలమో పని చేస్తాయిఅయితే అవి క్రమేపీ అరిగిపోతుంటాయికాబట్టి తమ విలువని కొద్దికొద్దిగా కోల్పోతూకోల్పోయే విలువని కొంచెంకొంచెంగా ఉత్పాదితానికి బదిలీ చేస్తాయిఆ ఉత్పాదితాలకు విలువని కలపకుండానే ఈ శ్రమ సాధనాలు   నిరంతరాయంగా పునరావృతమయ్యే ఉత్పత్తి ప్రక్రియలో, ఉత్పాదితాల తయారీలో ఉపకరిస్తాయి- ప్రత్యేకమైన ప్రయోజనక ఫలితాల్ని సాధిస్తాయి. ఉత్పాత్తి కారకాలుగా విలువని కలపకుండానే , సంపూర్ణంగా నియోగించబడినాపాక్షికంగా మాత్రమే వినియోగమవుతాయి. అవి ఏ నిష్పత్తిలో అయితే వినియోగమవుతాయో, అదే నిష్పత్తిలో ఉచిత సేవ చేస్తాయిఇంతకు ముందు మనం చూసినట్లుగాఅవి ప్రకృతి శక్తులైన నీరూ,ఆవిరీగాలీవిద్యుచ్ఛక్తీ వగైరాలు ఏనిష్పత్తిలో ఉచిత సేవ  చేస్తాయో అదే నిష్పత్తిలో ఉచిత సేవ చేస్తాయిగతశ్రమ యొక్క ఉచిత సేవని సజీవ శ్రమ పట్టుకొని జవసత్వాలతో నింపితేసంచయనపు పెరుగుదల దశలతో పాటు  ఉచిత సేవ కూడా పెరుగుతుంది.
పెట్టుబడి ముసుగులో గతశ్రమ
గత శ్రమ ఎల్లవేళలా పెట్టుబడిగా ముసుకేసుకొని ఉంటుందిఅంటే,A, B, C మొదలైనవారి శ్రమకి చెల్లించాల్సిన / పడ్డ అప్పు శ్రమచెయ్యని X ఆస్థిగా మారువేషం ధరిస్తుందిఅందువల్ల బూర్జువాలూరాజకీయ ఆర్ధిక వేత్తలూ మృత శ్రమ, గతశ్రమ(dead and gone labour) చేసే సేవను కీర్తిస్తారుస్కాట్ లాండ్ మేధావి మెక్కుల్లాక్ గత శ్రమకు వడ్డీలాభం వంటి రూపాల్లో ప్రత్యేక పారితోషికం వచ్చితీరాలి అన్నాడుఉత్పత్తిసాధనాల రూపంలో  శ్రమ ప్రక్రియకు గతశ్రమ సజీవ శ్రమకు శక్తివంతమైననిరంతర సహాయం అందిస్తుంది ఆ సహాయం చెల్లించబడని శ్రమగాకార్మికుని నుండే పరాయీకరించబడిన గత శ్రమ రూపానికి అంటే  పెట్టుబడిదారీ రూపానికి ఆపాదించబడింది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రతినిధులూ, ‘అల్పమైనవాటికి అనల్పమైన ప్రాధాన్యతనిచ్చే’ (pettifogging) వారి సిద్ధాంతకర్తలూ ఉత్పత్తి సాధనాల్ని, అవి వేసుకున్న శతృపూరిత సామాజిక ముసుగునుంచి వేరుపరచి ఆలోచించలేకపోయారు- ఒక బానిస యజమాని శ్రామికున్ని, బానిసగా ఆ శ్రామికుని స్వభావాన్నించి వేరుగా ఎలా చూడలేడో అలాగే. 
4.అడ్వాన్స్ చేసిన పెట్టుబడి పరిమాణం
శ్రమశక్తి దోపిడీ ఒకనొకస్థాయిలో ఉన్నప్పుడుఉత్పత్తయ్యే అదనపువిలువ ఏకకాలంలో దోపిడీ చెయ్యబడే శ్రామికుల సంఖ్యనుబట్టి నిర్ణయమవుతుందిఇది పెట్టుబడి పరిమాణానికి అనుగుణంగా ఉంటుందివేర్వేరు నిష్పత్తుల్లో అయినప్పటికీఆవిధంగా వరస సంచయనాల వల్ల ఆపెట్టుబడి పెరిగేకొద్దీవినియోగనిధిగానూసంచయన నిధిగానూ విభజితమయ్యే మొత్తం విలువ మరీమరీ పెరుగుతుందిఅందువల్ల పెట్టుబడిదారుడు మరింత జాలీ జీవితం గడపగలడుఅదే సమయంలో మరింతగా 'కోర్కెల వర్జింపు ' పాటించినట్లు కనపడగలడుచివరగాఅడ్వాన్స్ పెట్టిన పెట్టుబడి రాశి  విస్తరణతోపాటుఉత్పత్తి స్ప్రింగులు అన్నీ మరింత స్థితిస్థాపకతతో పనిచేస్తాయిఉత్పత్తి స్థాయి మరింతగా విస్తృతమవుతుంది.   
వచ్చే పోస్ట్ :శ్రామిక నిధి అనబడేది