29, సెప్టెంబర్ 2018, శనివారం

వేతనాల్లో జాతీయ వ్యత్యాసాలు

అధ్యాయం 22
వేతనాల్లో జాతీయ వ్యత్యాసాలు

వేతనాలు అన్నిదేశాల్లో ఒకే పరిమాణంలో ఉండవు. దేశానికీ దేశానికీ వ్యత్యాసం ఉంటుంది. శ్రమశక్తి విలువని నిర్ణయించే అంశాల్లో ఉండే తేడాలే ఇందుకు కారణం. భిన్నదేశాల వేతనాల్ని పోల్చేటప్పుడు శ్రమశక్తి విలువ మొత్తంలో మార్పుల్ని నిర్ణయించే అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకోవాలి అంశాలు:
1. జీవితావసరాల ధరావిస్తృతీ.
2.శ్రామికుల శిక్షణ కయ్యే ఖర్చు
3.స్త్రీల శ్రమపిల్లల శ్రమ పోషించే పాత్ర
4.శ్రమ ఉత్పాదకత
5. శ్రమ తీవ్రత
ఏదో పైపైన పోల్చాలన్నావేర్వేరు దేశాల్లోఒకేరకం వృత్తుల్లో సగటు దిన వేతనాన్ని ముందుగా ఒకేరకమైన పనిదినంగా కుదించడం తప్పనిసరి.అలా దిన వేతనాల్ని ఒకేరకానికి కుదించిన తర్వాతకాలం వేతనాన్ని శాల్తీ వేతానాల్లోకి మార్చాలిఎందుకంటే,  శ్రమ ఉత్పాదకతకీశ్రమ తీవ్రతకీ రెండింటికీ శాల్తీ వేతనం మాత్రమే కొలమానంగా ఉండగలదు.
శ్రమ తీవ్రతాశ్రమ ఉత్పాదకతా
 దేశంలోనైనా సగటు శ్రమతీవ్రత ఎంతోకొంత ఉంటుందిఅంతకు తగ్గితే ఒకసరుకు ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం కన్నా ఎక్కువ కాలం పడుతుంది. అందువల్లఅది మామూలు నాణ్యత ఉన్న శ్రమగా పరిగణించబడదు. వేర్వేరు దేశాలుసగటు శ్రమతీవ్రత అన్ని దేశాల్లో ఒకటిగా ఉండదుడేశానికీ దేశానికీ తేడా ఉంటుందిఒకదేశంలో ఎక్కువమరొకదేశంలో తక్కువ ఉంటుంది దేశాల సగటులు ఒక కొలమానాన్ని ఏర్పరుస్తాయి. కొలమానం ప్రమాణం(unit of measure ) ప్రపంచ శ్రమ యొక్క సగటు ప్రమాణం.అందువల్ల  ఎక్కువ తీవ్రత గల దేశశ్రమతక్కువ తీవ్రత గల దేశశ్రమతో పోలిస్తేఅది అదే కాలంలో ఎక్కువ విలువని ఉత్పత్తిచేస్తుందిఆవిలువ ఎక్కువ డబ్బులో వ్యక్తమవుతుంది.
అంతర్జాతీయ విలువలు                                                                                                                      అయితే విలువ నియమం అంతర్జాతీయస్థాయిలో వర్తించే టప్పుడు మరికొంత మారుతుందిఎందువల్లంటేప్రపంచ మార్కెట్లో ఎక్కువ ఉత్పాదకత ఉన్న దేశశ్రమ ఎక్కువ తీవ్రత ఉన్న శ్రమగా కూడా లెక్కకొస్తుంది - పోటీ మూలంగా ఆదేశపు సరుకుల  ధరని వాటి విలువ స్థాయికి తగ్గించనంతవరకూ మాత్రమే. ఒక దేశంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధయిన నిష్పత్తిలోనేఆదేశ జాతీయ శ్రమ తీవ్రతాశ్రమ ఉత్పాదకతా అంతర్జాతీయ స్థాయిని మించి పెరుగుతాయివేర్వేరు దేశాల్లో ఒకే కాలంలో ఉత్పత్తయిన ఒకేరకమైన సరుకులు భిన్నమైన అంతర్జాతీయ విలువలు కలిగి ఉంటాయి.
ఆవిలువలు వేర్వేరు ధరల్లో - అంటేఅసమానమైన అంతర్జాతీయ విలువల్ని బట్టి మారే డబ్బు మొత్తాల్లో -వ్యక్తమవుతాయి.
అందువల్లడబ్బు యొక్క సాపేక్ష విలువ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంలో కంటేతక్కువ అభివృద్ధి చెందిన దేశంలో కంటే తక్కువ ఉంటుందిదీన్నిబట్టినామక వేతనం - డబ్బులో వ్యక్తమయ్యే శ్రమ శక్తి సమానకం - కూడా రెండో డేశంలో కంటే మొదటి దేశంలోనే ఎక్కువ ఉంటుందిఅయితేఇది నిజ వేతనానికి - శ్రామికుడి అందుబాటులో ఉన్న జీవనాధార సాధనాలకి - కూడా వర్తిస్తుందని రుజువు అయినట్లు కానేకాదు.
నామక వేతనాలూనిజ వేతనాలూ
నామకపు వేతనాలకీ  నిజ వేతనాలకీ తేడా ఉంటుంది. కార్మికుడు పెట్టుబడిదారుడికి అమ్మే శ్రమశక్తికి గాను పొందే డబ్బు నామక వేతనం. ఆ డబ్బుతో అతను కొనగల వస్తువుల మొత్తం నిజ వేతనంనిజమైన వేతనం స్థాయి నామక వేతనం పరిమాణం మీదాశ్రామికుని జీవితావసరవస్తువుల  ధరలమీదా ఆధారపడుతుందినామక వేతనం మారకుండా ఉన్నప్పటికీ , జీవితావసర వస్తువుల ధరలు పెరిగితే నిజమైన వేతనాలు తగ్గుతాయివాస్తవంలో నామకపు వేతనాలు పెరిగినప్పటికీజీవితావసర వస్తువుల ధరలు పెరిగితేనిజమైన వేతనాలు పడిపోతాయి.     
పెట్టుబడిదారీ అభివృద్ధీ- వేతన వ్యత్యాసాలూ
భిన్న దేశాల్లో డబ్బు విలువలో ఉండే సాపేక్ష వ్యత్యాసాలు ఎలావున్నాఒక విషయం తరచుగా తెలుస్తుందివేతనం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంలో తక్కువ అభివృద్ధి చెందిన దేశంలో కంటే ఎక్కువ వుంటుందికాగాసాపేక్ష శ్రమ ధర - అంటేఅదనపు విలువతోనూఉత్పాదితం విలువతోనూ పోల్చిన శ్రమధర - మొదటి దేశంలో కంటే రెండో దేశంలో ఎక్కువ ఉంటుంది.
స్మిత్ కి వ్యతిరేకంగా చేసిన వాదనలో జేంస్ ఆండర్ సన్ ఇలా అన్నాడు:నేలనించి వచ్చే  ఉత్పత్తుల ధరప్రత్యేకించి ధాన్యం ధర చౌకగా ఉండే పేద దేశాల్లో  శ్రమధర సాధారణంగా తక్కువగా ఉన్నట్లు పైకి కనిపించేఉంటుంది.కాని వాస్తవానికి శ్రమధర చాలావరకూ రెండో దేశాల్లో కంటే  మొదటి దేశంలోనే ఎక్కువ ఉంటాయి.ఎందుకంటేనిజమైన శ్రమ ధర అనేది రోజుకి శ్రామికునికి ఇచ్చే వేతనం కాదు -  వేతనం పైకి కనిపించె శ్రమ ధర రూపం అయినప్పటికీనిజమైన ధర అంటేవాస్తవంగా చేసిన  కొంత పరిమాణం గల శ్రమకి యజమానికి ఎంత ఖర్చయిందో అంతఅదే నిజమైన ధర దృష్టితో చూస్తేప్రతి సందర్భంలోనూ సంపన్న దేశాల్లో కంటేపేద దేశాల్లో శ్రమ చౌక - ధాన్యం ధరాఇతర జీవితవసరాల ధరలూ మొదటి (సంపన్నదేశాల్లో  కంటే రెండో (పేదదేశాల్లో సాధారణంగా తక్కువగా ఉన్నప్పటికీ...రోజుని బట్టి లెక్కిస్తేఇంగ్లండ్ లో కంటే స్కాట్ లాండ్ లో శ్రమ చౌక..శాల్తీని బట్టి చూస్తే ఇంగ్లండ్ లో చౌక. (James Anderson, ―Observations on the Means of Exciting a Spirit of National Industry,‖ &tc., Edin. 1777, pp. 350, 351)
ఇందుకు భిన్నంగావేతనాలు తక్కువగా ఉండడం అనేది తిరిగి శ్రమని ప్రియం చేస్తుంది.- ఇంగ్లండ్ లోకంటే శ్రమ ఐర్లండ్ లో ప్రియంఎందుకంటేవేతనాలు అంత తక్కువ ఉంటాయి గనక (N. 2079 in ―Royal Commission on Railways, Minutes,‖ 1867.) 
1833 లో J.W.కొవెల్ నూలు వర్తకాన్ని శ్రద్ధగా పరిశోధించి ఒక నిర్ధారణకొచ్చాడుఇంగ్లండ్ వేతనాల్నీ ఐరోపా ఖండ వేతనాల్నీ పోల్చిచూస్తే,  ఇంగ్లండ్ లో ఐరోపా ఖండంలో కంటే వేతనాలు పెట్టుబడిదారుడికి తక్కువ - శ్రామికుడికి ఎక్కువే అయినప్పటికీ. (Ure, op. cit., p. 314.)

అలెగ్జాండర్ రెడ్ గ్రేవ్ అనే ఫాక్టరీ ఇన్స్పెక్టర్ 1866 అక్టోబర్ 31 నివేదికలో  క్రింది విషయాన్ని రుజువుచేశాడు:
తక్కువ వేతనాలు ఎక్కువ పనికాలం ఉన్నప్పటికీ ఐరోపా దేశాల శ్రమఉత్పాదితంతో పోల్చిచూస్తేఇంగ్లిష్ శ్రమకంటే ప్రియం.ఓల్డెంబెర్గ్ లో ఒక నూలు మిల్లు ఇంగ్లిష్ మేనేజర్ ఇలా చెప్పాడుఅక్కడ పనికాలం ఉదయం 5.30 నుంచీ రాత్రి 8 గంటలదాకా.శనివారం కూడా అంతేవాళ్ళు ఇంగ్లిష్ పర్యవేక్షకులకింద పనిచేసినప్పుడు ఇంగ్లిష్ వాళ్ళు 10 గంటల్లో ఉత్పత్తి చేసినంత చేసేవాళ్ళు కాదుఅయితే జర్మన్ పర్యవేక్షకుల కింద ఉన్నప్పుడు ఇంకా తక్కువ ఉత్పత్తి చేసేవాళ్ళు.వేతనాలు ఇంగ్లండ్ లోకంటే బాగా తక్కువ.ఎక్కువ సందర్భాల్లో 50 శాతమేఅంటే సగానికి సగమే.అయితే యంత్రాలతో కార్మికుల నిష్పత్తి ఎక్కువ.కొన్ని శాఖల్లో అది 5:3
రష్యా నూలు ఫాక్టరీల గురించి రెడ్ గ్రేవ్ పూర్తి వివరాలు ఇచ్చాదుఇటీవల వరకూ అక్కడ పనిచేసిన ఒక ఇంగ్లిష్ మేనేజర్ ఆసమాచారాన్ని ఆయనకు ఇచ్చాడు.రష్యా నేల అన్ని దురాగతాలకూ ఆలవాలంఇంగ్లిష్ ఫాక్టరీల ప్రారంభ కాలంలో జరిగిన ఘోరాలన్నీ పూర్తిస్థాయిలో తాండవమాడాయి.స్థానిక రష్యా పెట్టుబడిదారుడికి ఫాక్టరీ వ్యాపారం చేతకాదు.అందువల్ల మేనేజర్లు ఇంగ్లిష్ వాళ్ళురాత్రింబవళ్ళు  అతి పని సాగించినాకార్మికులకు సిగ్గుపడేతమత్ కీతా వేతనాలు ఇచ్చినా రష్యా మాన్యుఫాక్చర్  విదేశీ పోటీని నిషేధించడం ద్వారా మాత్రమే మనగలిగింది / బతికి బట్టగట్టగలిగింది
ఇందుకు రుజువుగ్గ మార్క్స్ రెడ్ గ్రేవ్ ఇచ్చిన పట్టికని ఇచ్చాడు.అందులో ఐరోపాదేశాల్లో ఒక్కొ ఫాక్టరీలో ఉన్న సగటు కదుళ్ళ సంఖ్యాఒక్కొక కార్మికుడు నిర్వహించె సగటు కదుళ్ళ సంఖ్యా ఉన్నాయి.

దేశం
ఒక ఫాక్టరీలో ఉన్న సగటు కదుర్ల సంఖ్య
ఇంగ్లండ్
12,600
ఫ్రాన్స్
1,500
ప్రష్యా
1,500
బెల్జియం
4,000
శాక్సనీ
4,500
ఆస్ట్రియా
7,000
స్విజర్లండ్
8,000

కదుళ్ళను బట్టి నియమితులైన కార్మికుల సగటు సంఖ్య

దేశం
ఒక కార్మికుడు పనిచేసే కదుళ్ళ సంఖ్య
ఫ్రాన్స్
14
రష్యా
28
ప్రష్యా
37
బవేరియా
46
ఆస్ట్రియా
49
బెల్జియం
50
శాక్సనీ
50
స్విజర్లండ్
55
జర్మనీ చిన్నరాజ్యాలు
55
గ్రేట్ బ్రిటన్
74

 పోలిక బ్రిటన్ కి మరింత ప్రతికూలమమైనదేకారణం,  అక్కడ అనేక ఫాక్టరీలు  పవర్ తో నడుస్తాయివాటిలో నెయ్యడమూవడకడమూ జమిలిగా జరుగుతాయి.(కాని పై పట్టికలో నేతగాళ్ళను తీసివెయ్యలేదు). పైగా ఇతరదేశాల ఫాక్టరీలు ప్రధానంగా నూలు వడికే ఫాక్టరీలువడికే ఫాక్టరీల్ని అటువంటి వాటితోనే పోల్చడానికి వీలుంటేమాజిల్లాలో చాలా వడికే ఫాక్టరీల్లో ఒక కార్మికుడు ఇద్దరు సహాయకులతో 2,200 కదుర్లను నిర్వహిస్తాడు. 400 మైళ్ళ పొడవుండే, 220 పౌన్ల నూలు వడుకుతాడు.
తూర్పు ఐరోపాలో ఆసియాలో లాగేఇంగ్లిష్ కంపెనీలు రైల్వే నిర్మాణాన్ని చేపట్టాయిఅందుకు స్థానిక శ్రామికులతో పాటు ఇంగ్లిష్ కార్మికుల్నికూడా పెట్టుకున్నాయి.ఇది తెలిసిన సంగతేఆచరణలో అవసరంవల్లఆవిధంగా వాళ్ళు శ్రమ తీవ్రతలో ఉన్న జాతీయ భేదాన్ని లెక్కలోకి తీసుకోవలసివచ్చింది.అయితే దానివల్ల వాళ్ళకి నష్టమేమీ రాలేదువాళ్ళ అనుభవం చెప్పేదేమంటే : వేతనాల స్థాయి సగటు శ్రమ తీవ్రతకి ఇంచుమించు అనుగుణంగా ఉన్నాగానిసాపేక్ష శ్రమ ధర (అంటే,ఉత్పాదితంతో సంబంధంలో శ్రమధర) సాధారణంగా విలోమదిశలో మారుతుంది.
 వచ్చే పోస్ట్: పెట్టుబడి సంచయనం