28, అక్టోబర్ 2018, ఆదివారం

సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞుల పొరపాటు అవగాహన


అధ్యాయం 24: అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం
విభాగం 2.
విస్తృత పునరుత్పత్తి గురించి సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞుల పొరపాటు అవగాహన
సంచయనం -అదనపు విలువ తిరిగి పెట్టుబడిలోకి మారడం- గురించి లోతుగా పరిశీలించే ముందుసాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞు లు తెచ్చిపెట్టిన సందిగ్ధతని(ambiguity) తొలిగించాలి.  పెట్టుబడిదారుడు తన అదనపువిలువలో కొంత వెచ్చించి, సొంత వినియోగానికి సరుకులు కొంటాడుఅందుకు కొనే సరుకులు ఉత్పత్తికీవిలువసృష్టికీ ఉపకరించవుఅలాగే తన అవసరాలకోసం కోనే శ్రమకూడా అందుకు ఉపకరించదుతన కొచ్చిన అదనపువిలువలోని  భాగాన్ని, పెట్టుబడి లోకి మార్చడు. మార్చే బదులుఅందుకు భిన్నంగా సరుకుల్నో శ్రమనో కొనడం ద్వారా ఖర్చు పెట్టుకుంటాడుకనక అది పెట్టుబడికి కలవదుఅంటే అది పెట్టుబడిలోకి మారదుసంచయనం జరగదు.
సంచయనంచెయ్యడం - సాధ్యాసాధ్యాలు
పాత భూస్వామ్య ప్రభువర్గం భృత్యులతో ఆడంబరాలకీవిలాసాలకీ చేతికి చిక్కిన దాన్నంతా ఖర్చుపెట్టేవారుబూర్జువా అర్ధశాస్త్రజ్ఞులు  అలాంటి జీవత విధానాన్ని వ్యతిరేకించేవాళ్ళుసంచయనం చెయ్యడాన్ని సమర్ధించేవాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు.  వాళ్ళ సిద్ధాంతం ప్రకారంసంచయనంచెయ్యడం ప్రతి పౌరుడి ప్రధమ విధిబాధ్యత.- అని ఎడతెరిపి లేకుండా బోధ చేసేవారు.ఏవ్యక్తయినావచ్చిన ఆదాయాన్నంతా వ్యయం చేస్తుంటే సంచయనం చెయ్యలేడనీకనుక అందులో గణనీయమైన భాగాన్ని  అదనపు ఉత్పాదక శ్రామికుల్ని నియమించడానికి ఖర్చు చేయ్యాలనీఅలా చేస్తే ఖర్చుకి మించిన ఆదాయం వస్తుందనీ నిర్విరామంగా బోధ చేసేవారు సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడం బూర్జువా అర్ధశాస్త్రానికి అత్యంత ప్రధానమైనది.
సారాంశం: సంచయనం పౌరుల ప్రధాన విధిఅనుత్పాదక శ్రామికుల్ని పెట్టుకుంటే ఆదాయం ఖర్చవుతుంది.వచ్చిన ఆదాయాన్నంతా వాళ్ళమీద ఖర్చు పెడితే సంచయనం సాధ్యం కాదుఅలాంటి అనుత్పాదక శ్రామికుల్ని  కాకుండా, విలువని సృజించే ఉత్పాదక శ్రామికుల్ని పెట్టుకుంటేవాళ్ళు  ఖర్చుని మించి ఆదాయం తెస్తారుకనుక సంచయనం సాధ్యమవుతుంది.
బూర్జువా అర్ధశాస్త్రజ్ఞులు ఖండించిన దురభిప్రాయం
మరొకపక్కఅర్ధశాస్త్రజ్ఞులు మరొక తప్పు అభిప్రాయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందిపరిశీలించకుండానేసరైనది అనుకున్న  అభిప్రాయం ఇదేపెట్టుబడి సంచయనం దాచిపెట్టిన నిల్వ (hoarding) వంటిదేసంచయనాన్నీదాచిన నిల్వనీ గందరగోళ పరిచిన అభిప్రాయంసంచయనమైన సంపద అనేది వినియోగించకుండా ఉంచిన సంపద లేదా చలామణీ నుంచి ఉపసం హరించబడిన సంపద అనేదే  అపోహ.
ఆర్ధశాస్త్రజ్ఞులు దీన్ని వ్యతిరేకిస్తూ చేసిన వాదన : చలామణీలో లేకుండా చేస్తేఆడబ్బు పెట్టుబడిగా స్వయంవిస్తరణ చెందజాలదుఇక  సరుకుల రూపంలో దాచిపెట్టి సంచయనం చెయ్యడం కేవలం తెలివిలేని పని.  భారీ సరుకుల రాశుల సంచయనం రెండు కారణాల వల్ల సంభవిస్తుంది:
1.అమితోత్పత్తి వల్ల
2.చలామణీకున్న అడ్డంకుల వల్ల, చలామణీ ఆగిపోవడంవల్ల  
ప్రజాభిప్రాయం అలా ఏర్పడడానికి కారణంఒకపక్కనిత్య వాడకం కోసం భాగ్యవంతులు నిల్వ చేసుకున్న సరుకుల రాశుల్నీమరొకపక్క భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్న నిల్వలనూ చూసి ప్రజలు అలా భావించిన మాట నిజమేవీటిలో రెండోది (భవిష్యత్తు కోసం నిల్వ చెయ్యడంఅన్ని ఉత్పత్తి విధానాల్లోనూ ఉన్న విషయమే.  చలామణీని విశ్లేషించే సమయంలో దాని మీద కొంచెం దృష్టి పెడదాం.
సాంప్రదాయ అర్ధశాస్త్రం సరిగా చెప్పిన విషయం
అదనపు ఉత్పాదితాల్ని అనుత్పాదక శ్రామికులు కాకుండావారికి బదులు ఉత్పాదక శ్రామికులు వినియోగించుకోవడం సంచయన ప్రక్రియకి స్వాభావిక లక్షణంఅని  సాంప్రదాయ అర్ధశాస్త్రం సరిగానే చెప్పింది.
అయితే సరిగ్గా ఇక్కడే పొరపాట్లుకూడా ప్రారంభమయ్యాయి.
సాంప్రదాయ అర్ధశాస్త్రం చెప్పిన పొరపాటు అభిప్రాయాలు
ఆడం స్మిత్ పొరపాటు
స్మిత్ ప్రకారం అదనపు ఉత్పాదితాల్ని ఉత్పాదక శ్రామికులు వినియోగించడమే సంచయనందీన్ని బట్టిఅదనపు విలువని పెట్టుబడిలోకి మార్చడం అంటే కేవలం అదనపువిలువని శ్రమశక్తిగా మార్చడమే అని అర్ధం.  
2. రికార్డో పొరపాటు
ఈ పాయింట్ మీద రికార్డో ఏం  చెప్పాడో చూద్దాం: ఒక దేశంలో ఉత్పత్తయినవన్నీ వినియోగ మయినట్లు అర్ధం చెసుకోవాలి. అయితే ఆ ఉత్పత్తుల్ని పునరుత్పత్తిచేసే శ్రామికులు వినియోగించారా, లేక మరొక విలువని సృజించని శ్రామికులు వినియోగించారా - అన్నది ఎంతో ముఖ్యమైన విషయం. చాలా తేడా చూపించే విషయం. ఆదాయం పొదుపుచెయ్యబడి పెట్టిబడితో కలప బడింది అన్నప్పుడు అర్ధం దాన్ని అనుత్పాదక శ్రామికులు కాకుండా, ఉత్పాదక శ్రామికులు వినియోగించుకున్నారని అర్ధంవినియోగం లేకుండానే పెట్టుబడి పెరుగుతుంది అనుకోడం కన్నా పెద్ద దోషం మరొకటి ఉండదు.
తర్వాత ఆర్ధికవేత్తలు
ఆవిధంగా స్మిత్ చెప్పినదాన్ని అనుసరించి రికార్డోఆయన తర్వాత ఆర్ధికవేత్తలూ దాన్నే పునశ్చరణ చేశారుదాన్నిమించిన పొరపాటు ఏదీ లేదువాళ్ళ అభిప్రాయం ఇదేపెట్టుబడికి జతచేయ్యబడిందని చెప్పబడుతున్న  ఆదాయ భాగం ఉత్పాదక శ్రామికులచేత వినియోగమవుతుందిదీని ప్రకారం పెట్టుబడిలోకి మారిన అదనపు విలువ అంతా అస్థిర పెట్టుబడి అవుతుందిఅయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందిమొదటి పెట్టుబడి లాగే అదనపు విలువ కూడా  ఉత్పత్తి సాధనాల్లోకీశ్రమశక్తిలోకీ విభజితమవుతుందిఉత్పత్తిలో అస్థిర పెట్టుబడి  ఉండే రూపమే శ్రమశక్తి ప్రక్రియలో పెట్టుబడిదారుడు శ్రమశక్తిని వినియోగించుకుంటాడు,  శ్రమ శక్తి తనచర్య అయిన శ్రమ చేసేటప్పుడు ఉత్పత్తిసాధనాల్ని వినియోగించుకుంటుంది.  
అదే సమయంలోశ్రమశక్తిని కొనడానికి చెల్లించిన డబ్బు జీవితావసరవస్తువుల్లోకి మారుతుందిఆవస్తువులు వినియోగమయ్యేది ఉత్పాదకశ్రమ చేత కాదుఉత్పాదక శ్రామికుని చేతస్మిత్ మౌలికంగా అపసవ్యమైన తన విశ్లేషణతో అసందర్భమైన నిర్ధారణ కొచ్చాడుఆనిర్ధారణఒక్కో వ్యక్తి పెట్టుబడి స్థిరఅస్థిర భాగాలులుగా విభజితమైనప్పటికీసమాజ పెట్టుబడి కేవలం అస్థిర పెట్టుబడిగా - అంటేవేతనాలు చెల్లించడానికిమాత్రమే కెటాయించబడ్డ పెట్టుబడిగా అవుతుంది.
స్మిత్ వాదన తప్పు
  స్మిత్ నిర్ధారణలో ఉన్న దోషం ఏమిటో చూద్దాం. ఉదాహరణకి ఒక బట్ట ఉత్పత్తిదారుడు 2,000 పౌన్లని పెట్టుబడిలోకి మార్చాడు అనుకుందాంఅందులో ఒక భాగాన్ని నేత కార్మికుల్ని కొనడానికి వెచ్చిస్తాడుమరొక భాగాన్ని నూలుయంత్రాలు వగయిరాలకు కేటాయిస్తాడుఅయితే దారాన్నీ యంత్రాల్నీ ఎవరినుండి కొంటాడో వాళ్ళు తమకు వచ్చిన డబ్బులో ఒక భాగంతో శ్రమకు చెల్లిస్తారు 2000 పౌన్లు మొత్తం వేతనాల చెల్లింపుకి ఖర్చయ్యే వరకూఅంటే, 2000 పౌన్ల విలువచేసే  పూర్తి ఉత్పాదితం ఉత్పాదక శ్రామికులచే వినియోగమయ్యే వరకూ - ఆవిధంగానే కొనసాగుతుంది.    
పై వాదన సారాంశం మొత్తం 'అది ఆవిధంగాఅనే మాటల్లో ఉందిఅది మనల్ని ఒకచోటు నుంచి మరొకచోటికి తరుముతూ ఉంటుందివాస్తవానికి పరిశోధనలో చిక్కులు ఏర్పడి కలగగానే  స్మిత్ పరిశోధన ముగిస్తాడు. ఇలాంటి తప్పు తర్కాన్ని జాన్ స్టువర్ట్ మిల్ సైతం గమనించలేదుకాని అది బూర్జువా సైన్స్ దృష్ట్యా చూచినా తప్పుదిద్దుబాటుని కోరుతుంది. మిల్ ప్రతి సందర్భంలోనూ గురువు గందరగోళాన్ని పట్టుకొని పిడివాదం చేసే శిష్యుడిగా ఉంటాడు.  అలాగే ఇక్కడకూడా: పెట్టుబడి చివరికి పూర్తిగా వేతనాలు అవుతుందిఉత్పత్తిని అమ్మగా తిరిగి వచ్చినప్పుడు తిరిగి వేతనాలు అవుతుంది.
మార్కెట్లో చిక్కు
వార్షిక ఉత్పత్తి మొత్తాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నంత కాలంవార్షిక పునరుత్పత్తి ప్రక్రియ తేలిగ్గా తెలుస్తుందిఅయితే  ఉత్పాదితంలో ప్రతి భాగాన్నీ (every single component) సరుకుగా మార్కెట్ కి తేవాలిఅక్కడ చిక్కు ఏర్పడుతుంది.
వైయక్తిక పెట్టుబడుల చలనాలూవైయక్తిక ఆదాయ చలనాలూ వ్యతిరేక దిశల్లో ఉంటాయికలగలిసిపోతాయిసమాజ సంపద చలామణీలో వైయక్తిక పెట్టుబడుల చలనాలూవైయక్తిక ఆదాయ చలనాలూ వ్యతిరేక దిశల్లో ఉంటాయికలగలిసిపోతాయిచోటు మారడంలో దారీ తెన్నూ లేకుండా పోతాయి పరిస్థితి మనల్ని తీవ్ర గందగోళానికి గురిచేస్తుందిఆలోచించే శక్తిని పోగొడుతుంది.  పరిష్కారం కోసం చిక్కు సమస్యల్ని మనముందు పెడుతుందిఅయితే మార్క్స్ ఈవిషయాన్ని ఇంతటితో ఆపుతాడువీటికి సంబంధించిన వాస్తవవిషయాన్ని కాపిటల్ మూడో సంపుటంరెండో భాగంలో విశ్లేషిస్తాను అంటాడు. 
ఫిజియోక్రాట్లు
 సమస్యని తగిన సాధనాలు ఉపయోగించి పరిష్కరించే ప్రయత్నం చేసిన వాళ్ళు ఫిజియోక్రాట్లువాళ్ళు తమ Tableau économiqueలో చలామణీ ప్రక్రియ నుంచి బయట పడ్డాక  వార్షికోత్పత్తి ఏరూపంలో ఉందోఆరూపాన్ని వర్ణించడానికి మొట్టమొదట ప్రయత్నించారుతన పూర్వీకులకంటేప్రత్యేకించి ఫిజియోక్రాట్ల కంటే స్మిత్పునరుత్పత్తి ప్రక్రియనీసంచయ ప్రక్రియనీ వివరించడంలో  ముందుకు పోలేదుపోకపోగా గణనీయంగా వెనకబడ్డాడు .
స్మిత్ పిడివాదం
సరుకుల ధర వేతనాలులాభం (వడ్డీ),కౌలు -వీటితో ఎర్పడుతుందనేఅంటే కేవలం వేతనాలుఅదనపు విలువలతో ఏర్పడుతుందనే అసాధారణ పిడివాదం స్మిత్ ది. తన పిడివాదాన్ని రాజకీయ అర్ధశాస్త్రానికి వారసత్వంగా సంక్రమింపజేశాడు. గ్రంధంలో చెప్పిన ఈ పిడివాదం అధుతమైన. తన పిడివాదాన్ని రాజకీయ అర్ధశాస్త్రానికి వారసత్వంగా సంక్రమింపజేశాడు.గ్రంధంలో చెప్పిన ఈ పిడివాదం అద్భుతమైనది. ఈ ప్రాతిపదికనుండి బయల్దేరి, స్టార్చ్ అవసర ధరని దాని  మౌలిక అంశాలుగా స్పష్టపరచడం అసాధ్యం  అని అమాయకంగా అంగీకరించాడు. తన పిడివాదాన్ని రాజకీయ అర్ధశాస్త్రానికి వారసత్వంగా సంక్రమింపజేశాడు.గ్రంధంలో చెప్పిన ఈ పిడివాదం అధుతమైన పిడివాదం. ఈ ప్రాతిపదికనుండి బయల్దేరి, స్టార్చ్ అవసర ధరని దాని  మౌలిక అంశాలుగా స్పష్టపరచడం అసాధ్యం  అని అమాయకంగా అంగీకరించాడు. సరుకు ధరలోని అంశాలు  ఇవి అని తేల్చడం సాధ్యం కాదు అని చెప్పే అర్ధశాస్త్రం 'ఎంత శ్రేష్టమైనదో'! ఈ పాయింట్ మీద కాపిటల్ మూడో సంపుటం ఏడో భాగంలో మరింత ఎక్కువగా పరిశోధన ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంతవరకే. 
మిగిలిన విషయానికొస్తే, పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ అర్ధశాస్త్రం స్మిత్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం కాలేదు. ఈ పొరపాటు సిద్ధాంతాన్ని అర్ధశాస్త్రజ్ఞులు  పెట్టుబడిదారులకి అనుకూలంగా వాడుకున్నారు.
 ఆసిద్ధాంతం ఇదే: పెట్టుబడిలోకి మార్చబడే అదనపు ఉత్పాదితంలొని భాగం మొత్తాన్నీ కార్మిక వర్గమే వినియోగించు కుంటుంది. 
వచ్చే పోస్ట్ అదనపు విలువ పెట్టుబడిలోకీఆదాయంలోకీ  విడివడడం.