5, ఆగస్టు 2018, ఆదివారం

శ్రమశక్తి ధర పరిమాణంలోనూ, అదనపువిలువ పరిమాణంలోనూ మార్పులు


అధ్యాయం -17
శ్రమశక్తి ధర పరిమాణంలోనూఅదనపువిలువ పరిమాణంలోనూ మార్పులు
 చాప్టర్ అంతటా రెండు పరిస్థితులు ఉన్నట్లు భావించి ముందుకుపోతాడు మార్క్స్అవి:
1.సరుకులు వాటి విలువలకే అమ్ముడవుతాయి.
2.శ్రమశక్తి ధర అరుదుగా దానివిలువ కన్నా ఎక్కువవుతుందికాని ఎన్నడూ తగ్గదు.
అవిధంగా అనుకుంటేఅదనపువిలువ సాపేక్ష పరిమాణాలూశ్రమ శక్తి ధరా  కింది మూడు అంశాలమీద ఆధారపడి ఉంటాయి:
        పనిదినం పొడవు
        మామూలు శ్రమ తీవ్రత
        శ్రమ ఉత్పాదకత 
కాబట్టివేర్వేరు పరిస్థితులు ఉంటాయి.
  రెండు అంశాలైనా స్థిరంగా ఉండిమిగిలిన మూడో అంశం మారవచ్చు.
ఒక అంశం మాత్రమే స్థిరంగా ఉండిమిగిలిన రెండు అంశాలూ మారవచ్చు.
మొత్తం మూడు అంశాలూ ఏక కాలంలో  మారవచ్చు.
ఈమార్పుల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే మార్క్స్ పరిగణనలోకి తీసుకుంటాడు.

A. పనిదినం పొడవూ, శ్రమ తీవ్రతా-  స్థిరంగా ఉండి, మూడో అంశం శ్రమ ఉత్పాదకత  మారుతున్నప్పుడు

ముందే  అనుకున్న వాటిని (assumptions) బట్టి శ్రమ శక్తి విలువాఅదనపువిలువ పరిమాణమూ  మూడు నియమాల చేత నిర్ణయమవుతాయి నియమాలు:
మొదటి నియమం
ఒక నిర్ణీత నిడివి ఉన్న పనిరోజు ఎల్లప్పుడూ ఒకే మొత్తం విలువని ఉత్పత్తి చేస్తుంది. శ్రమ ఉత్పాదకతా,దాంతో వచ్చే ఉత్పాదితమూఒక్కొక విడి సరుకు ధర ఎంతగా మారినా సరేపైవిలువ మొత్తం ఏమాత్రం మారదుఉదాహరణకి, 12 గంటల పనిదినంలో ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులుశ్రమ ఉత్పాదకత మారితేఉత్పత్తయిన సరుకుల సంఖ్య మారుతుందిఫలితం 6 షిల్లింగుల విలువ మరిన్ని సరుకులకు ఎక్కువో తక్కువో పరచబడుతుందిఅంతే.  ఉదాహరణకి రోజులో 50 వస్తువులు తయారయ్యేవనీవాటి విలువ 500 రూపాయలనీ అనుకుందాఇప్పుడు ఉత్పాదకత పెరిగి అదే కాలంలో 100 ఉరువులు ఉత్పత్తయినా, 200 లో 400 లో  ఎన్ని ఉత్పత్తయినా సరే, వాటి మొత్తం విలువ 500 రూపాయలేఅది మారదుఒక్కొక్క ఉరువు విలువ మారుతుంది. 50 ఉరువులు తయరైనప్పుడు ఒక్కోదాని విలువ 10 రూపాయలు.100 అయితే  రూపాయలు. 200  అయితే 2.5 రూపాయలు, 400 అయితే 1.25 రూపాయలు.   
రెండో నియమం
  అదనపువిలువాశ్రమ శక్తి విలువా వ్యతిరేక దిశల్లో మారతాయిఅంటే ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది.
12 గంటల పనిదినంలో 6 షిల్లింగుల విలువ ఉత్పత్తయిందనీ, ఇందులో శ్రమ శక్తి విలువా అదనపు విలువా సమానం - చెరొక 3 షిల్లింగులు- అనీ అనుకుందాం. ఇప్పుడు ఒకటి 4 షిల్లింగులు కావాలంటేరెండోది 2 షిల్లింగులకు  తగ్గి తీరాలి. అవి రెండూ ఏకకాలంలో పెరగడంగానీతగ్గడంగానీ సాధ్యం కాదు.
ఉత్పాదకతా అదనపు విలువా
ఉత్పాదకశక్తిలో మార్పు (దాని పెరుగుదలాతగ్గుదలాదానికి వ్యతిరేక వ్యతిరేక దిశలో శ్రమ శక్తి విలువలో మార్పు తెస్తుందిఅంటేఉత్పాదక శక్తి పెరిగితేశ్రమశక్తి విలువ తగ్గుతుందిఉత్పాదకశక్తి తగ్గితే శ్రమశక్తి విలువ పెరుగుతుందిఅదనపు విలువ కదలిక ఇందుకు భిన్నంగా ఉత్పాదకత మారే దిశలోనే మారుతుందిఅంటే ఉత్పాదకత పెరిగితే అదనపు విలువ పెరుగుతుందిఅది తగ్గితే ఇదీ తగ్గుతుంది. 12 గంటల పనిదినంలో  షిల్లింగుల విలువ ఉత్పత్తయితే, అది శ్రమశక్తి విలువాఅదనపువిలువా కలిసిన మొత్తంఒక స్థిర పరిమాణం రెండు భాగాలుగా ఉంటేఒకటి తగ్గనిదే రెండోది పెరగదు.ఇది స్వయం స్పష్టం.  
పైగాశ్రమ ఉత్పాదకత పెరగకపోతేశ్రమ శక్తి విలువ తగ్గదుదాని ఫలితమైన అదనపువిలువ పెరగదుశ్రమ శక్తి విలువ తగ్గితేనే,అదనపు విలువ పెరుగుతుంది.శ్రమశక్తి విలువ తగ్గాలంటేఉత్పాదకత పెరగాలి.
పై ఉదాహరణలో శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులుఅది 2 షిల్లింగులకి దిగాలంటే,మునుపు 6 గంటల్లో ఉత్పత్తయినంత ఇప్పుడు 4 గంటల్లోనే ఉత్పత్తవాలిఅంటేఉత్పాదకత పెరగాలిశ్రమ శక్తి విలువ 4 షిల్లింగులకు పెరగాలంటేమునుపు 6 గంటల్లో ఉత్పత్తయిన జీవితావసరాల ఉత్పత్తికి ఇప్పుడు 8 గంటలు పట్టాలిదీన్ని బట్టి,ఉత్పాదకతలో పెరుగుదల శ్రమ శక్తి విలువని తగ్గించిఅదనపువిలువని పెంచుతుంది. 
అలాగని  మార్పులు ఒకే నిష్పత్తిలో జరుగుతాయని కాదుఅలా నిర్ధారించడం కుదరదు.
రికార్డో పొరపాటు
 నియమాన్ని రూపొందించేటప్పుడు రికార్డో ఒక పరిస్థితిని పట్టించుకోలేదుఏమంటేఅదనపు విలువ పరిమాణంలో మార్పుశ్రమ శక్తి విలువలో మార్పుని వ్యతిరేక దిశలో తెచ్చినంతమాత్రానఅవి ఒకే నిష్పత్తిలో మారతాయి అనడం వీలవదు నిష్పత్తికి సంబంధించిన పెరుగుదలగానీతగ్గుదలగానీ ఉత్పాదకతలో మార్పు రాకముందు వాటి పరిమాణాల్ని బట్టి ఉంటుందిశ్రమ శక్తి విలువ 4 షిల్లింగులు, అదనపువిలువ 2 షిల్లింగులు లేదా అవసర శ్రమకాలం 8 గంటలుఅదనపు శ్రమ 4 గంటలు అనుకుందాంఅప్పుడు ఉత్పాదకత పెరిగి శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులకులేక అవసరశ్రమ 6 గంటలకు తగ్గితేఅదనపువిలువ 3 షిల్లింగులకు లేక అదనపుశ్రమ 6 గంటలకు పెరుగుతుంది.ఒకే పరిమాణం ఒక షిల్లింగు లేక 2 గంటల శ్రమ ఒక దానిలో కలుస్తుందిరెండో దాంట్లో తీసివేయబడుతుందిఅయితే పరిమాణానికి సంబంధించిన నిష్పత్తికిలో మార్పు  సందర్భంలోనూఈసందర్భంలోనూ వేర్వేరుగా ఉంటుందిశ్రమశక్తి విలువ 4 షిల్లింగులనుండి 3 షిల్లింగులకి పడితేఅంటే 25% శాతం తగ్గితేఅదనపు విలువ 2 షిల్లింగులనుంచి 3 షిల్లింగులకుఅంటే 50% పెరుగుతుందికాబట్టిశ్రమ ఉత్పాదకతలో మార్పువల్ల వచ్చే అదనపు విలువలో మార్పు అదనపు విలువనిచ్చే మునుపటి పనిదినం భాగం పరిమాణాన్ని బట్టి ఉంటుందిఆభాగం తక్కువయితేనిష్పత్తిలో మార్పు ఎక్కువ వుంటుందిఆభాగం ఎక్కువయితేనిష్పత్తిలో మార్పు తక్కువ వుంటుంది.   
మూడో నియమం
అదనపు విలువలో మార్పు (పెరుగుదల/తగ్గుదలశ్రమ శక్తి విలువలో మార్పుకి అనుగుణంగా ఉంటుందికాని శ్రమ శక్తి విలువ లో మార్పుకి, అదనపు విలువలో మార్పు కారణం కాదు. శ్రమ శక్తి విలువ తగ్గితేఅదనపు విలువ పెరుగుతుందిఅది పెరిగితే ఇది తగ్గుతుందిఅవి ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో కదులుతాయి.ఇక్కడ శ్రమ శక్తి విలువ అంటే శ్రామికుల మామూలు జీవనాధార సాధనాల విలువ.ఇది స్థిరంగా ఉన్నట్లు లెక్క.
 నియమం ప్రకారం అదనపు విలువ పరిమాణంలో మార్పు రావాలంటేముందు శ్రమ శక్తి విలువలో కదలిక రావాలి కదలిక శ్రమ ఉత్పాదకతలో మార్పు వల్ల వస్తుంది. మార్పు పరిమితి, మారిన శ్రమ శక్తి విలువని బట్టి ఉంటుంది.
 నియమం అమలైన పరిస్థితుల్లో సైతం అనుబంధ కదలికలు (subsidiary movementsఉండవచ్చు.
ఉదాహరణకిఉత్పాదకత పెరిగినందువల్ల శ్రమ శక్తి విలువ 4 షిల్లింగులనుండి 3 షిల్లింగులకు (లేక అవసర శ్రమకాలం 8 గంటలనించీ 6 గంటలకిపడింది అనుకుందాంఅప్పుడు శ్రమ శక్తి ధర 3షిల్లింగుల 8 పెన్నీలకన్నా లేక  షి. 6పె కన్నాలేక  3షి. 2 పె కన్నా తగ్గకపోవచ్చుదాని ఫలితంగా అదనపు విలువ 3 షిల్లింగుల 4 పెన్నీలను మించి, లేక   షి 6 పె. ను మించి,3 షి 10 పె. ను మించి పెరగక పోవచ్చు. శ్రమ శక్తి ఇప్పటి కొత్త విలువ 3 షిల్లింగులు కనుక అంతకన్నా తగ్గదు. ఏమేరకు తగ్గుతుంది అనేది, ఒకవైపు తగ్గించాలని పెట్టుబడిదారుడు పెట్టే ఒత్తిడి, రెండో వైపు దాన్ని ప్రతిఘటించే శ్రామికుని ఒత్తిడి - ఈరెంటి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది.
శ్రమ శక్తి విలువని నిర్ణయించేది నిర్ణీత పరిమాణం గల జీవితావసరాల విలువ. శ్రమ ఉత్పాదకత మారితే మారేది ఆ అవసరాల విలువే, కాని వాటి రాశి కాదు.అయితే, శ్రమ శక్తి ధరలోనూ, అదనపువిలువలోనూ ఏమార్పూ లేకపోయినా, ఉత్పాదకత పెరుగుదల వల్ల, కార్మికుడూ, పెట్టుబడిదారుడూ ఇద్దరూ కూడా  మరింత ఎక్కువ పరిమాణంలో ఈ జీవితావసరాలను స్వాయత్తం చేసుకోవడం సాధ్యమే.
శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు, అవసర శ్రమకాలం 6 గంటలు, అదనపు విలువ 3 షిల్లింగులు, అదనపు శ్రమకాలం 6 గంటలు - అయినప్పుడు అవసర , అదనపు శ్రమల నిష్పత్తి మారకుండా ఉంటే, అదనపు విలువ పరిమాణంలోగానీ, శ్రమశక్తి ధర పరిమాణంలో గానీ మార్పు ఉండదు.
దాని ఫలితం ఒక్కటే :  రెంటిలో అదీ ఇదీ  మునుపటికన్నా రెట్టింపు ఉపయోగపు విలువలకు ప్రతినిధ్యం వహిస్తాయి ఉపయోగపు విలువలు మునుపటికంటే రెండింతలు చౌకవుతాయిశ్రమ శక్తి ధరలో మార్పు రానప్పటికీఅది దాని విలువ కంటే ఎక్కువే ఉంటుంది. అయినప్పటికీశ్రమశక్తి ధర ఇప్పటి కనీస స్థాయి అయిన 1 షి.6 పె.కు కాకుండా 2 షి 10పెకో,2 షి 6 పెకో  పడిపోతేఈతక్కువ ధర కూడా మునుపటికన్నా ఎక్కువ జీవితావసర వస్తువులకు  ప్రతినిధిగా ఉంటుంది.   ఈవిధంగాశ్రమ శక్తి ధర తగ్గుతూ పోతున్నాశ్రామికుని జీవితావసరాల రాశి పెరుగుతూ ఉండడం సాధ్యమేఅటువంటి సందర్భంలో సైతం శ్రమశక్తి విలువలో పతనంఅదనపు విలువలో దానికనుణమైన పెంపుని తెస్తుందిఆవిధంగా కార్మికుని స్థాయికీపెట్టుబడి దారుడి స్థాయికీ మధ్య ఉండే అఖాతం అంతకంతకూ వెడల్పు అవుతుంది.
రికార్డో ఈనియమాల్ని సూత్రీకరించాడు
పైన చెప్పిన మూడు నియమాల్నీ మొట్టమొదట కచ్చితంగా సూత్రీకరించిన వాడు రికార్డోఅయితే ఇక్కడ రెండు పొరపాట్లు చేశాడు.
మొదటి పొరపాటు. ఇవి వర్తించే ప్రత్యేక పరిస్థితుల్ని పెట్టుబడిదారీ ఉత్పత్తికీ సర్వ సాధారణమైన ఏకైక పరిస్థితులుగా పరిగణించాడు.ఆయనకు పనిదినం పొడవులో మార్పులుగానీ, శ్రమ తీవ్రతలో మార్పులుగానీ ఉండే మార్పులు పరిశీలించలేదు.అందువల్ల ఆయన ప్రకారం మారే అంశం ఒక్కటే. అదే శ్రమ ఉత్పాదకత.మిగిలినవి మారవు. ఇదొక పొరపాటు.
రెండో పొరపాటు. అదనపువిలువని ఒకమొత్తంగా చూడలేదు. లాభం, కౌలు వంటి అదనపు విలువ భాగాలను, దాని ప్రత్యేక రూపాల్ని దేనికదిగా చూశాడు. మొదటి పొరపాటు కన్నా ఇది ఆయన విశ్లేషణని ఎక్కువ లోప భూయిష్టం చేసింది. 'అదనపు విలువ సిద్ధాంతాలూ పుస్తకం మొదట్లోనే ఈవిషయంలో అందరూ అదే పొరపాటు చేశారంటాడు:                             ఆర్ధిక వేత్తలందరూ అదనపు విలువని దానికదిగా, స్వచ్చమైన రూపంలో పరిశీలించకుండా, దాని ప్రత్యేకరూపాలైన లాభంగానూ,కౌలుగానూ పరిశీలించి పొరపాటు చేశారు.(Theories of Surplus Value Vol 1. p.40)                           పొరపాటు ఫలితంరికార్డో అదనపువిలువ రేటు నియమాల్నీలాభంరేటు నియమాల్నీ కలిపి గందరగోళపరుస్తాడు.
రికార్డో గందరగోళం
ఇదివరకే చెప్పినట్లు లాభం రేటు పెట్టిన మొత్తం పెట్టుబడితో అదనపువిలువ నిష్పత్తిఅదనపు విలువ రేటు మొత్తం పెట్టుబడిలో ఒక భాగమైన అస్థిర పెట్టుబడితో అదనపువిలువ నిష్పత్తి.
ఉదాహరణకిమొత్తం పెట్టుబడి (C) 500 పౌన్లనీఅందులో స్థిరభాగం (c) 400, అస్థిరభాగం (v)100 పౌన్లనీ, అదనపు విలువ (s) 100 పౌన్లనీ అనుకుందాం.
అప్పుడుఅదనపు విలువ రేటు = అదనపు విలువ/అస్థిర పెట్టుబడి = 100/100= 100%
లాభం రేటు s/v= అదనపు విలువ/మొత్తం పెట్టుబడి = 100/500 = 20%
లాభం రేటు అదనపు విలువ రేటుని ఏవిధంగానూ  ప్రభావితం చెయ్యని పరిస్థితులమీద ఆధారపడి ఉండవచ్చు.
ఒకే అదనపు రేటు ఉన్నాఎన్నో లాభం రేట్లు ఉండవచ్చుననీవేర్వేరు అదనపు విలువ రేట్లు  ఒకే లాభం రేటుని వ్యక్తం చెయ్య వచ్చనీ   సంపుటంలో చూపిస్తాను.
B.పనిదినమూశ్రమ ఉత్పాదకతా స్థిరంగా ఉండిశ్రమ తీవ్రత మారుతూ ఉన్నప్పుడు 
మామూలు  శ్రమ తీవ్రతతో గంటకి 20 కొబ్బరికాయలు వలిస్తేఎక్కువ శ్రమ తీవ్రతతో 30 లేక 40 వలవ వచ్చుఅంతే కాలంలో, అంటే పనికాలం పెరగకుండానే ఎక్కువ సరుకులు ఉత్పత్తవుతాయిఉత్పాదకత పెరిగినా అదే ఫలితం వస్తుందిఏది పెరిగినా ఉత్పత్తయ్యే ఉరువులు పెరుగుతాయి.
మరి రెంటికీ తేడా ఏమిటి?
విలువ విషయం వేరు.శ్రమ తీవ్రత పెరిగినా ఒక్కొక్క సరుకు విలువ మారదుకాని ఉత్పాదకత పెరిగి నప్పుడు ఒక్కొక్క సరుకు విలువ తగ్గుతుంది.ఉత్పాదకత తగ్గి నప్పుడు ఒక్కొక్క సరుకు విలువ పెరుగుతుంది. 

ఉత్పాదకత పెరిగిన సందర్భంలో ఒక్కొక్క ఉరువు విలువ మారుతుంది. ఎందుకంటేఅంతకు ముందు కన్నా ఇప్పుడు తక్కువ శ్రమ పడుతుందిశ్రమ తీవ్రత పెరిగిన సందర్భంలో దాని విలువ అలానే ఉంటుందిఎందుకంటేఅంతకు ముందు ఎంత శ్రమ పట్టిందోఇప్పుడూ అంతే శ్రమ పడుతుందికనుక ఉరువుల సంఖ్య పెరుగుతుందికాని ఒక విడి ఉరువు ధరలో మార్పు రాదుఅంటే, 30 ఉరువులు బదులు 40 ఉరువులు ఉత్పత్తవుతాయివాటి మొత్తం ధర అప్పుడు 300 రూపాయలు ఉంటేఇప్పుడు 400 రూపాయలు ఉంటుందివాటి సంఖ్యతోపాటే ధర మొత్తమూ పెరుగుతుంది.ఉత్పాదకత పెరిగిన సందర్భంలో మునుపటి 30 ఉరువుల  విలువ ౩౦౦ రూపాయలు మరిన్ని 40 ఉరువులకు పరచబడుతుందికనుక మునుపు 10 రూపాయలు గావున్న ఒక్కొక్క ఉరువు ధర తగ్గిఇప్పుడు 7 ½
 రూపాయలు అవుతుంది.

అయితే మొత్తం విలువ మునుపు ఉన్నంతే ఉంటుందిడబ్బు విలువ మారకపోతే మరింత డబ్బు వస్తుంది.శ్రమ తీవ్రత సమాజంలో మామూలుగా ఉన్న శ్రమ తీవ్రత స్థాయినుండి ఏమేరకు వైదొలగుతుందో దాన్ని బట్టి ఉత్పత్తయ్యే విలువ మారుతుంది.అందువల్ల ఒక నెర్ణీత పనిదినంలో ఉత్పత్తయ్యే విలువ స్థిర పరిమాణం కాదుమారే పరిమాణం.12 గంటల పనిదినంలో మామూలు శ్రమ తీవ్రతతో ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులు అనుకుందాం.  శ్రమ తీవ్రత పెరిగెకొద్దీఉత్పత్తయ్యె విలువ 7,8 ఇంకా మరిన్ని షిల్లింగులో కావచ్చు.
ఒక రోజు శ్రమ ఉత్పత్తి చేసే విలువ పెరిగితే?

 విలువ శ్రమ శక్తి విలువగానూఅదనపు విలువగానూ రెండు భాగాలవుతుంది.అవి రెండూ ఏకకాలంలో సమంగానోఅసమంగానో పెరుగుతాయన్నది  స్పష్టమే.అదీ ఇదీ 3 నుంచి 4 షిల్లింగులకు పెరగవచ్చుఇక్కడ శ్రమ శక్తి ధర పెరుగుదలని చూసి ధర శ్రమ శక్తి విలువను మించి కచ్చితంగా పెరిగిందని చెప్పడం కుదరదు. అందుకు భిన్నంగాధర పెరిగివిలువ తగ్గవచ్చు.ఇదెప్పుడు జరుగుతుంది?
శ్రమ శక్తి ధర పెరుగుదలపెరిగిన శ్రమ తీవ్రతమూలంగా శ్రమశక్తికి ఎక్కువ అరుగూతరుగూ (wear and tear) ఉంటుంది అరుగు,తరుగుల నష్టపరిహారాన్ని శ్రమ శక్తి ధరలో పెరుగుదల పూడ్చ నప్పుడు అలా జరుగుతుంది.. ఉదాహరణకి శ్రమ శక్తి ధర 6 పెన్నీలు పెరిగి, శ్రమ శక్తి అరుగుదుల 8 షిల్లింగులకు పెరిగితే ఈ ఫలితం వస్తుంది.

ఉత్పాదకతా శ్రమ తీవ్రతా రెండూ  అదనపు విలువని పెంచే సాధనాలేఎక్కువ ఉత్పాదకత కార్మికులు వాడే వస్తువులు తయారు చేసే శ్రమ ఉత్పదకత పెరిగితేనేసాపేక్ష అదనపు విలువ ఏర్పడుతుందివాళ్ళు వాడని వస్తువులు చేసే శ్రమ ఉత్పాదకత పెరిగినా శ్రమ శక్తి విలువ మారదు. 
ఇందుకు భిన్నంగా ఎక్కువ శ్రమ తీవ్రత ఎల్లప్పుడూ  మరింత అదనపు విలువని ఇస్తుంది. ఇది మనకు తెలిసిందే ప్రస్తుత సందర్భంలో ఇది  ర్తించదు.ఎందువల్ల?
శ్రమ కాలంలోనో,శ్రమ తీవ్రతలోనో మార్పు  అయితేఎల్లప్పుడూ దానికి అనుణంగాఉత్పత్తయిన విలువ పరిమాణంలో మార్పు వస్తుంది - ఆవిలువ చేరిన వస్తువు స్వభావంతో నిమిత్తముండదుఅదేదైనా సరే.
శ్రమ తీవ్రత అన్ని పరిశ్రమ శాఖల్లోనూ సమంగాఏకకాలంలోపెరిగితే కొత్తఎక్కువ తీవ్రతే సమాజంలో మామూలు స్థాయి తీవ్రత అవుతుందికాబట్టి అదిక లెక్కలో ఉండదు.
అయినాఅప్పుడు కూడా వేర్వేరు దేశాల్లో శ్రమ తీవ్రత వేర్వేరుగా ఉంటుందివిలువ నియమపు అంతర్జాతీయ వర్తింపుని సవరిస్తుందిఒక దేశంలో శ్రమ తీవ్రత ఎక్కువవుంటేఅక్కడ పనిదినం తక్కువ తీవ్రత ఉన్న దేశం పనిదినంతో పోలిస్తేఎక్కువ డబ్బుకి ప్రతినిధిగా ఉంటుంది.
C.  శ్రమ ఉత్పాదకతాశ్రమ తీవ్రతా స్థిరంగా ఉండిపనిదినం పొడవు మారితే...
ఫనిదినం నిడివిరెండు విధాలుగా మారవచ్చు.అది పెరగావచ్చుతగ్గావచ్చు.
మనకున్న దత్తంశాల నుండిమనం ముందుగా అనుకున్న వాటి పరిధిలో మూడు నియమాలొస్తాయి.
1.ఫనిదినంలో దాని పొడవునుకి అనుగుణంగా ఎక్కువో తక్కువో విలువని ఉత్పత్తి చేస్తుంది.ఆవిధంగా విలువ పరిమాణం అస్థిరంగా ఉంటుంది.స్థిర పరిమాణంగా ఉండదు.
2.అదనపు విలువ పరిమాణానికీశ్రమ శక్తి విలువ పరిమాణానికీ మధ్య సంబంధంలో  మార్పు అయినా అదనపు శ్రమ యొక్క పరమ పరిమాణంలో మార్పు నుంచి, దాని పర్యవసానంగా అదనపు విలువ పరిమాణంలో మార్పు నుంచి మాత్రమే వస్తుంది.  
3. అదనపు శ్రమ పొడిగింపు శ్రమ శక్తి అరుగుదలమీద ప్రభావం నెరుపుతుంది ప్రభావానికి ప్రతిచర్య ఫలితంగా మాత్రమే శ్రమ శక్తి పరమ విలువ మారగలదుఅందువల్ల, పరమ విలువలో  మార్పయినా అదనపు విలువ పరిమాణంలో మార్పుకి ఫలితమే కానిఅందుకు  కారణం  ఎన్నటికీకాదు.

 పనిదినంపొడవు తగ్గిన సందర్భాన్ని ముందు చూస్తాడు.
పైన 1 లో చెప్పిన పరిస్థితుల్లోపనిదినం తగ్గింపు శ్రమశక్తి విలువనీదాంతో పాటు అవసర శ్రమ కాలాన్నీ మార్చకుండా అలానే ఉంచుతుందిఅవసర శ్రమ కాలం పరమ పరిమాణంతో పాటుదాని సాపేక్ష పరిమాణంకూడా పడిపోతుందిఅంటేమారకుండా అలాగే వున్న శ్రమ శక్తి విలువతో పోలిస్తే సాపేక్షంగా అదనపు విలువ పరిమాణం  పడిపోతుందిపెట్టుబడి దారుడి వాటా తగ్గుతుందిఆపరిస్థితిలో, శ్రమ శక్తి ధరని తగ్గించడం ద్వారా మాత్రమేపెట్టుబడి దారుడు తనకు హాని జరగకుండా చూసుకోగలడు.
శ్రమ తీవ్రతాఉత్పాదకతా స్థిరంగా ఉంటేశ్రమ శక్తి విలువ తగ్గించకుండా పనిదినాన్ని తగ్గిస్తే అదనపు విలువ తగ్గుతుందిగంట వేతనం పెరుగుతుందిఅయితే ఇలాంటి పరిస్థితి రావడం చాలా అరుదువాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది ఉత్పాదక శక్తిలోనూతీవ్రతలోనూ మార్పు పనిదినం కుదింపుకి ముందుగానీఅది జరిగీ జరగగానే గానీ వస్తుందిఇక్కడ ఫుట్ నోట్ : నష్టాన్ని భర్తీచేసే పరిస్థితులు ఉన్నాయి.వాటిని 10 గంటల పనిదినం అమలు మూలంగా అవి వెలుగులోకి వచ్చాయిఅంటేపెట్టుబడి దారీ విధానం  లాభాన్ని తగ్గించే ప్రభావాల్ని తటస్థీకరించే మార్గాలు కనుక్కుంటుంది.
2. పనిదినం పొడిగింపు.అవసర శ్రమ కాలం 6 గంటలు లేక శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు, అదనపు విలువకూడా అంతే అనుకుందాంఅంటేపనిదినం 12 గంటలుఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులుఇప్పుడు శ్రమ శక్తి ధర అలానే వుండిపనిదినం 2 గంటలు పెరిగితే అదనపు విలువ సాపేక్షంగానూ నిరపేక్షంగానూ కూడా పెరుగుతుందిశ్రమ శక్తి విలువలో నిరపేక్ష మార్పు లేకున్నా,  అది సాపేక్షంగా తగ్గుతుంది.  పనిదినం పొడిగింపు.అవసర శ్రమ కాలం 6 గంటలు లేక శ్రమ శక్తి విలువ 3 షిల్లింగులు
అదనపు విలువకూడా అంతే అనుకుందాంఅంటేపనిదినం 12 గంటలుఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులుఇప్పుడు శ్రమ శక్తి ధర అలానే వుండిపనిదినం 2 గంటలు పెరిగితే అదనపు విలువ సాపేక్షంగానూ నిరపేక్షంగానూ కూడా పెరుగుతుందిశ్రమ శక్తి విలువలో నిరపేక్ష మార్పు లేకున్నా,  అది సాపేక్షంగా తగ్గుతుంది. 

లో ఉన్నాయనుకున్న పరిస్థితుల్లో శ్రమ శక్తి విలువ పరమ పరిమాణంలో మార్పు లేనిదేదాని సాపేక్ష పరిమాణంలో మార్పు రాదు.అయితే అందుకు వ్యతిరేకంగా ఇక్కడ శ్రమ శక్తి విలువ సాపేక్ష  పరిమాణంలో మార్పుపరమ అదనపు విలువ పరిమాణంలో మార్పు వల్ల వస్తుందిఒక రోజు శ్రమ ఉత్పత్తిచేసే విలువపనిరోజు పొడవుతో పాటు పెరుగుతుంది.కాబట్టిఅదనపు విలువా శ్రమశక్తి విలువా రెండూ కూడా ఏకకాలంలో పెరగవచ్చు - సమంగానోఅసమంగానో.
ఇలా ఏకకాలం లో రెండూ పెరగడం రెండు సందర్భాల్లో మాత్రమే సాధ్యం:
1. పనిదినం పొడవు వాస్తవంగా పెరిగినప్పుడు
2. పనిదినం పెంపు లేకపోయినాశ్రమ తీవ్రత పెరిగినప్పుడు.
పనిదినం పొడవు పెరిగితేశ్రమ శక్తి ధర నామకా మారకపోయినాలేదూ ఒకవేళ పెరిగినాశ్రమ శక్తి విలువకన్న తగ్గవచ్చుఇక్కడ ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోవాలిఎమంటే:ఒక రోజు శ్రమ శక్తి విలువ ఎలా లెక్కింప బడుతుందిదాని సాధారణ సగటు కాల పరిమాణాన్ని బట్టి.
రోజుకి కొంత శ్రమ శక్తి అరిగిపోతుందిపనిదినం పెరిగితే, అరుగుద లా పెరుగుతుంది నష్టాన్ని వేతనపెంపు  పరిహరించ వచ్చు.అయితే ఇది ఒక స్థాయి వరకే వీలవుతుందిఅది దాటితే అరుగుదల గుణ శ్రేణిలో  (geometrical progression) పెరుగుతుందిఅప్పుడు శ్రమశక్తి మామూలుగా పునరుత్పత్తి కావడానికీశ్రమ చెయ్యడానికీ తగిన ప్రతి పరిస్థితీ అణచివేయ బడుతుందిశ్రమ శక్తి ధరాదోపిడీ స్థాయీ  ఇక కొలవ తగిన పరిమాణాలుగా( commensurable quantities ) ఉండవు.
D.ఏకకాలంలో పొడవులోనూఉత్పాదకతలోనూ తీవ్రతలోనూ మార్పులు
మూడు అంశాలూ ఒకేసారి మారుతుంటేఅనేక కలయికలు సాధ్యమవుతాయి అనేది స్పష్టమేరెండు అంశాలు మారుతూమూడోది స్థిరంగా ఉండవచ్చులేదా ఒకేసారి మూడూ మారనూ వచ్చుఆమారేవి ఒకే దిశలోఒకే స్థాయిలో మారవచ్చులేదా వెర్వెరు స్థాయిల్లోవిరుద్ధ దిశల్లో నయినా మారవచ్చుఫలితంగా ఆయా మార్పులు ఒకదాన్నొకటి   పూర్తిగానో పాక్షికంగానో భంగం చెయ్యవచ్చు/ పరిహరించవచ్చుఅయినప్పటికీ, A,B,C లలో ఫలితాల దృస్ట్యా సాధ్యమయ్యే ప్రతి సందర్భాన్నీ విశ్లేషించడం సులభమే.  ఒక్కొక్క సారి ఒక్కొక్క అంశాన్ని అస్థిమైనదిగానూమిగిలిన రెంటినీ స్థిరమైనవిగానూ తాత్కాలింగా భావించిఏకలయిక ఫలితాన్నైనా కనుక్కోవచ్చు.
అందువల్లప్రతి సందర్భాన్నీ పరిశీలించాల్సిన పనేమీ లేదుఅయితే రెండు ముఖ్యమైన సందర్భాల్ని గమనించాలి.
1.పనిదినం పొడవు పెరుగుతుండగాతగ్గిపోతున్న శ్రమ ఉత్పాదకత
తగ్గిపొతున్న శ్రమ ఉత్పాదకత గురించి మాట్లాడటంలో మనం శ్రమ శక్తి విలువని నిర్ణయించే వస్తువుల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో శ్రమ ఉత్పాదకత తగ్గుదల గురించి మాట్లాడుతున్నాంఅటువంటి తగ్గుదలఉదాహరణకిభూసారం తగ్గి, ఆకారణంగా దాని ఉత్పత్తుల ధర పెరిగి ఏర్పడవచ్చు.
12 గంటల ఫనిదినంలో ఉత్పత్తయ్యే విలువ 6 షిల్లింగులనీఅందులో సగం శ్రమశక్తి విలువ అనీసగం అదనపువిలువ అనీ అనుకుందాం పరిస్థితుల్లోభూమి ఉత్పత్తుల విలువ పెరిగిశ్రమశక్తి ధర 3 నుంచి 4 షిల్లింగులకు పెరిగిందనుకుందాం.అంటే అవసర శ్రమకాలం 6 గంటల నుంచి 8 గంటలకు పెరుగుతుందిపనిదినం పొడవు మారకుండా ఉంటేఅదనపు శ్రమ కాలం 6 నించి 4 గంటలకు పడిపోతుంది.అదనపు విలువ 3 నించి 2 షిల్లింగులకు దిగుతుందిపనిదినం పొడవు 2 గంటలు (12 నించి 14 గంటలకుపెరిగితేఅదనశ్రమ కాలం మారకుండా 6 గంటలు అలాగే ఉంటుంది.అదనపు విలువ 3 షిల్లింగులు అలాగే ఉంటుంది. అయితేశ్రమ శక్తి విలువతో పోల్చిచూస్తేఅదనపు విలువ తగ్గుతుందిపనిదినాన్ని 4 గంటలు (12 నించి 16 గంటలకిపెంచితేఅదనపు విలువ,శ్రమశక్తి విలువలఅవసర శ్రమ అదనపు శ్రమల దామాషా పరిమాణాలు (proportional magnitudes)మారవుకాని పరమ అదనపు విలువ పరమ పరిమాణం 3 నించి 4 షిల్లింగులకుఅదనపు శ్రమ పరమ పరిమాణం 6 నించి 8 గంటలకు పెరుగుతుందిఅంటే 33 1/3 శాతం పెంపుఅందువల్ల  ఉత్పాదకత తగ్గుతున్నాఅదేసమయంలో  పనిదినం పొడవు పెరుగుతుంటే అదనపు విలువ యొక్క పరమ పరిమాణం అలాగే ఉంటుందిఅయితే అదే సమయంలో దాని సాపేక్ష పరిమాణం తగ్గుతుందిదాని సాపేక్ష పరిమాణం మారకుండాఅదేసమయంలో దాని పరమ పరిమాణం పెరగవచ్చుపనిదిన పొడవు తగినంత పెరిగితే  రెండు అంశలూ కూడా పెరగవచ్చు. 
చరిత్ర నుంచి ఉదాహరణ
ఇందుకు మార్క్స్ చరిత్ర నుంచి ఒక ఉదాహరణ ఇస్తాడు. 1799-1815 కాలంలో ఇంగ్లండ్ లో ఆహారపదార్ధాల వంటి నిత్య జీవితావసరాల ధరలు పెరిగాయినామక వేతనాలు కూడా  పెరిగాయిజీవితావసర వస్తువుల ధరలు పెరిగినంతగా పెరగలేదు.అంటే అంతకు ముందు వచ్చినన్ని సరుకులు ఇప్పుడు రావుదీన్ని బట్టినిజవేతనాలు తగ్గినట్లునామక వేతనాలు పెరిగినా.
లాభాలు మాత్రం తగ్గలేదుఅయితేరికార్డోవెస్ట్ -ఇద్దరూ లాభాలు తగ్గాయని అనుకున్నారుఅందుకు కారణంవాళ్ళుశ్రమ తీవ్రతనీపనిదినం పొడవునీ పట్టించుకోలేదు. లెక్కలోకి తీసుకోకుండా వదిలిపెట్టారు.
పైవాస్తవాన్ని బట్టి, రికార్దో, వెస్ట్  ఇద్దరూ వ్యవసాయంలో శ్రమ ఉత్పాదకత తగ్గడం వల్ల అదనపువిలువ రేటు తగ్గినట్లు తేల్చారు.వాస్తవంలొ లేని, వాళ్ళ ఊహలో మాత్రమే ఉన్న ఒక విషయాన్ని వేతనాల, లాభాల,కౌలుల పరిశోధనకు ఆరంభ బిందువు చేసుకున్నారు. అయితే నిజానికి ఆకాలంలో అదనపు విలువ శ్రమ తీవ్రతా, పనిదినం పొడవూ పెరిగినందువల్ల పెరిగింది - పరమంగానూ, సాపేక్షంగానూ. అది యజమానులు పనిగంటల్ని ఏ దారుణ మేరకైనా పెంచుకునే హక్కు స్థిరపడి ఉన్న కాలం; ఇక్కడ పెట్టుబడి పోగుబడి వేగవంతం అవడమూ, అక్కడేమో దుర్భర దారిద్ర్యం పెరగడమూ కాలపు ప్రత్యేక లక్షణం. మాల్థూస్ రికార్డో, వెస్ట్ లు పనిదినం పెంపునీ, శ్రమ తీవ్రతనీ లెక్కలోకి తీసుకోలేదని అన్నాడు.

2. శ్రమ తీవ్రతాఉత్పాదకతా పెరుగుతుండగాపనిదినం పొడవు తగ్గడం.

శ్రమ ఉత్పాదకత పెరిగినా,తీవ్రత పెరిగినా ఒకే ఫలితం వస్తుందినిర్ణీత కాలంలో ఉత్పత్తయ్యే వస్తువుల మొత్తం పెరుగుతుందికనుక అవిరెండూ అవసర శ్రమకాలాన్ని తగ్గిస్తాయి.  కుదించడానికి వీలయ్యే  అవసరశ్రమకాలం, పనిదినం యొక్క కనీస పరిమితిని నిర్ణయిస్తుందిమొత్తం పనిదినం  భాగం పొడవు వరకూ తగ్గితేఅదనపు విలువ అంతర్ధానం అవుతుంది పరిస్థితి పెట్టుబడిదారీ హయాం లో అసాధ్యంపెట్టుబడిదారీ ఉత్పత్తి రూపాన్ని అణగదొక్కడం ద్వారా మాత్రమేపనిదినం పొడవు అవసర శ్రమ కాలానికి తగ్గగలదుఆసందర్భంలో సైతం అవసర శ్రమ కాలపు హద్దులు విస్తరిస్తాయిఒకపక్కజీవితావసర సాధనాల భావన విస్తరించినందువల్ల కార్మికుడు భిన్నమైన జీవన ప్రమాణాన్ని కోరడం వల్లామరొకపక్కఇప్పుడు అదనపు శ్రమగా ఉన్నది  అప్పుడు అవసర శ్రమలో భాగంగా అవుతున్నందు వల్లా అవసర శ్రమ కాలపు పరిధి పెరుగుతుందిఅది నిల్వ(reserve fund) ఏర్పాటు చెయ్యడం కోసమూసంచయనంకోసమూ అని ఇక్కడ తనభావం అంటాడు మార్క్స్.
శ్రమ ఉత్పాదకత ఎంత పెరిగితేపనిదినాన్ని అంతగా తగ్గించవచ్చుపనిదినం తగ్గేకొద్దీశ్రమ తీవ్రత పెరగవచ్చుసమాజం వైపు నించి చూస్తేశ్రమ పొదుపు నిష్పత్తిలోనే శ్రమ ఉత్పాదకతా పెరుగుతుంది.
శ్రమ పొదుపు
శ్రమ పొదుపులో రెండు అంశాలుంటాయిఉత్పత్తి సాధనాల పొదుపుశ్రమ వృధా కాకుండా చూడడం ద్వారా పొదుపుపెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఒకవైపు ప్రతి వ్యష్టి వ్యాపారంలోనూ పొదుపుని బలవంతంగా అమలు చేస్తుందిచేస్తూనే మరొకవైపు దాని అరాచక పోటీ వ్యవస్థ చేత శ్రమ శక్తినీసామాజపు ఉత్పత్తిసాధనాల్నీ అత్యంత దారుణంగా దుర్వ్యయం చేస్తుందిఅసలు అవసరం లేకపొయినాప్రస్తుతం తప్పనిసరి అయిన అనేక పనుల్ని కల్పించే విషయం గురించి ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లేదు.
శ్రమ ఉత్పాదకత తీవ్రత ఫలా నింతని ఉంటే,  వస్తువుల ఉత్పత్తికి సమాజం ఖర్చు చెయ్యాల్స్ని టైం తగ్గుతుంది కారణంగావ్యక్తులకు బౌద్ధికంగానూసామాజికంగానూ అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది.సమాజంలో పనిచేసే శక్తి గల వాళ్ళందరికి మొత్తం పనిని అంతకంతకూ సమానంగా పంచడమూఒక ప్రత్యేక వర్గం తన శ్రమ భారాన్ని సమాజం లోని మరొక పొర భుజాల మీదకు నెట్టే అధికారాన్ని అంతకంతకూ తొలిగించడమూ జరిగే కొద్దీ  టైం పెరుగుతుంది దిశలోపనిదినం తగ్గింపుకి, శ్రమ సాధారణీకరణే తుది హద్దుని ఏర్పరుస్తుందిపెట్టుబడిదారీ సమాజంలో ఒక వర్గానికి జీవితకాలాన్ని యావత్తూ శ్రమ కాలంలోకి మార్చడం ద్వారా,  మరొక వర్గానికి విరామ కాలం దొరుకుతుంది.

   వచ్చే పోస్ట్ : అదనపు విలువ రేటు కనుక్కోడానికి వివిధ ఫార్ములాలు  
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి